‘టెంపర్’ కాలర్ ట్యూన్స్ ఇలా సెట్ చేసుకోవచ్చు
హైదరాబాద్: యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన ‘టెంపర్' మూవీ ఆడియో విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అభిమానులంతా మ్యూజిక్ డైరెక్టర్ అనూప్ రూబెన్స్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ముఖ్యంగా టెంపర్ టైటిల్ సాంగ్ ఎన్టీఆర్ రేంజికి తగిన విధంగా ఉందని అంటున్నారు.
తాజాగా ఎన్టీఆర్ అభిమానుల ఫోన్లంటిలోనూ ‘టెంపర్' మూవీ కాలర్ ట్యూన్స్ మారు మ్రోగుతున్నాయి. కాలర్ ట్యూన్లకు సంబంధించిన వివరాలు క్రింది ఇమేజ్ లో ఇవ్వబడ్డాయి. మరో వైపు ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదల చేసారు. ఎన్టీఆర్ పెర్ఫార్మెన్స్ సినిమాలో ఏ రేంజిలో ఉంటుందో ట్రైలర్ చూస్తే స్పష్టమవుతోంది.

ఆడియో విడుదల తర్వాత ‘టెంపర్' సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. రెస్పాన్స్ కు తగిన విధంగానే ఈ చిత్రాన్ని తొలిరోజు భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాత బండ్ల గణేష్ ఏర్పాట్లు చేస్తున్నారు. వెయ్యికిపైగా థియేటర్లు ఇప్పటికే బుక్ చేసినట్లు సమాచారం. మరో వైపు అమెరికాలోనూ ఈ చిత్రాన్ని 100కుపైగా స్క్రీన్లలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. సినిమాకు మ్యూజిక్ హైలెట్ అవుతుందని అంటున్నారు. ఫిబ్రవరి 12 లేదా 13న సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఫుల్‌లెంగ్త్ కమర్షియల్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ ఎత్తున ఆశలు పెట్టుకున్నారు.


Click it and Unblock the Notifications











