Don't Miss!
- News వైసీపీకి బీఆర్ఎస్ గతే: గంటా శ్రీనివాసరావు సంచనల వ్యాఖ్యలు
- Sports LSG vs CSK: రప్ఫాడించిన రాహుల్... లక్నో ఘన విజయం
- Automobiles వెస్పా 140 వ యానివర్సరీ వేడుకలు.. స్పెషల్ ఎడిషన్ స్కూటర్ లాంచ్..
- Lifestyle వేసవిలో కిడ్నీలు భద్రంగా ఉండాలంటే రోజూ ఎన్ని గ్లాసుల నీళ్లు తాగాలో తెలుసా?
- Technology రియల్‌మి ప్యాడ్ 2 వైఫై వేరియంట్ సేల్ ప్రారంభం.. రూ.2000 తగ్గింపు.. ఆఫర్ కొన్నిరోజులు మాత్రమే..!!
- Travel తెలంగాణలోని గొంతెమ్మగుట్ట సందర్శనకు బయలుదేరుదామా..?
- Finance Market Closing: మార్కెట్లను వీడిన నిరాశ మేఘాలు.. లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ..
ఏ హీరోయిన్ 'జిమ్ ట్రైనర్'కు ఎంత జీతం?: బాలీవుడ్లో ఇదీ రేటు!..
Recommended Video
గ్లామర్ వరల్డ్‌లో ఫిట్‌నెస్‌కు ఉండే ప్రాధాన్యం అంతా ఇంతా కాదు. బాడీ షేప్‌లో ఏమాత్రం తేడా కొట్టినా.. అవకాశాలు బోల్తా కొడుతాయి. కాబట్టి స్టార్ హీరోలు, హీరోయిన్లు, మోడల్స్ ఫిట్‌నెస్‌పై ప్రత్యేక దృష్టి పెడుతారు.
సరైన డైట్, సరైన ఫిట్నెస్ కోసం ప్రత్యేకంగా జిమ్ ట్రైనర్స్ ను నియమించుకుంటారు. ఇక సిక్స్ ప్యాక్స్ కోసం కష్టపడే హీరోలైతే.. భారీ మొత్తాన్ని ఆఫర్ చేసి మరీ విదేశాల నుంచి జిమ్ ట్రైనర్స్ ను రప్పించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
సరే ఇదంతా పక్కనపెడితే.. మిగతా ఇండస్ట్రీలతో పోలిస్తే బాలీవుడ్ హీరో, హీరోయిన్లకు ఫిట్‌నెస్‌పై శ్రద్ద ఎక్కువనే చెప్పాలి. అందుకే.. జిమ్ ట్రైనర్ల కోసం వారు భారీగానే ఖర్చు చేస్తున్నారు.
కరీనా కపూర్, కంగనా రనౌత్:
హీరోయిన్ కరీనా కపూర్ తన జిమ్ ట్రైనర్ నమ్రతా పురోహిత్‌కు నెలకు రూ.65 వేలు జీతం ఇస్తున్నారట. కంగనా రనౌత్ కూడా కరీనా ట్రైనర్ నమ్రతా పురోహిత్ దగ్గర శిక్షణ తీసుకుంటున్నారు. ఇందుకు గాను ఆమె కూడా నెలకు రూ.65వేలు చెల్లిస్తున్నారు.
సోనమ్ కపూర్:
సోనమ్ కపూర్ తన జిమ్ ట్రైనర్ రాధికా కర్లేకు నెలకు రూ.55 వేలు ఇస్తున్నారట.
ఆ ముగ్గురూ.
దీపికా పదుకొనే, అలియా భట్, బిపాసా బసు.. ఈ ముగ్గురూ ఒకే ట్రైనర్ వద్ద ట్రెయిన్ అవుతున్నారు. యాస్మిన్ కరాచివాలా అనే ట్రైనర్ వీరికి శిక్షణ ఇస్తున్నారు. ఈ ముగ్గురూ నెలకు రూ.45వేలు జీతంగా ఇస్తున్నారట.
జాక్వెలిన్ ఫెర్నాండెజ్, శ్రద్దా కపూర్:
శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెజ్ తన జిమ్ ట్రైనర్ సిండీ జోర్డన్‌కు నెలకు రూ.30 వేల జీతం ఇస్తున్నారట. బాలీవుడ్ నటి శ్రద్ధాకపూర్ కూడా సిండీ వద్దే శిక్షణ తీసుకుంటున్నారు. ఆమె కూడా నెలకు రూ.30వేలు చెల్లిస్తున్నారట.
మలైకా అరోరా:
నటి మలైకా అరోరా ఖాన్ తన జిమ్ ట్రైనర్‌కు అనుష్క పర్వానికి నెలకు రూ.73వేలు జీతంగా ఇస్తుండటం.