బోయపాటి అడిగినదానికి బాలయ్య కుదరదన్నాడా.. వాయిదా పడడానికి కారణం!

నందమూరి నటసింహం బాలయ్యకు ఈ ఏడాది రెండు ఎదురుదెబ్బలు తగిలాయి. ఎంతో ఇష్టపడి చేసిన తన తండ్రి ఎన్టీఆర్ బయోపిక్ తీవ్రంగా నిరాశపరిచింది. బాలయ్య ఎన్టీఆర్ పాత్రలో నటిస్తూ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మించారు. ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు రెండు భాగాలు బాక్సాఫీస్ వద్ద చతికిలబడ్డాయి. ఆ తర్వాత ఎన్నికల హడావిడి మొదలు కావడంతో బాలకృష్ణ మరో చిత్రాన్ని ప్రారంభించలేదు. ఎన్నికల సమరం ముగియడంతో బాలకృష్ణ కెమెరా ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు.

బోయపాటితో అనుకుంటే

బోయపాటితో అనుకుంటే

ఎన్టీఆర్ బయోపిక్ చిత్ర సమయంలోనే బోయపాటి శ్రీను మూడవసారి బాలయ్యని డైరెక్ట్ చేయబోతున్నట్లు స్పష్టం అయింది. అందుకు తగ్గట్లుగా ఎన్నికలు ముగిసిన తర్వాత ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. కానీ అనూహ్యంగా సీన్ లోకి సీనియర్ డైరెక్టర్ కేఎస్ రవికుమార్ వచ్చారు. బాలయ్య త్వరలో కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. బోయపాటి ఉండగా బాలయ్య రవికుమార్ కు ఎందుకు ఓకే చెప్పాడనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

 సినిమా వాయిదా

సినిమా వాయిదా

బోయపాటి, బాలయ్య చిత్రం కొంతకాలం వాయిదా పడిందని తాజాగా టాలీవుడ్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు రెండు సూపర్ హిట్స్ అందించిన దర్శకుడిని పక్కన పెట్టి కేఎస్ రవికుమార్ ని బాలయ్య ఎంచుకోవడానికి అనేక రకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బాలయ్య బోయపాటి సినిమా కోసం బరువు తగ్గాల్సి ఉందట. అందుకోసం కొంతకాలం ఈ చిత్రాన్ని వాయిదా వేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ లోపు కేఎస్ రవికుమార్ చిత్రాన్ని ఫినిష్ చేయాలని బాలయ్య భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 అంత బడ్జెట్ కుదరదు

అంత బడ్జెట్ కుదరదు

ఎన్నికలు ముగిసిన తర్వాత బాలయ్యకు బోయపాటి కథ వినిపించాడట. ఈ కథకు 70 కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని బోయపాటి బాలయ్యకు తెలిపినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని భారీ బడ్జెట్ లో తెరకెక్కించి దెబ్బతిన్న బాలయ్యకు మరోసారి అలాంటి ప్రయత్నం చేసే ఆలోచనలో లేడట. దీనితో 70 కోట్ల బడ్జెట్ కుదరదని.. 30 నుంచి 40 కోట్ల మధ్యలో పూర్తయ్యే కథతో రావాలని బోయపాటికి బాలయ్య సూచించినట్లు తెలుస్తోంది. అందుకే తాత్కాలికంగా బాలయ్య, బోయపాటి సినిమా వాయిదాపడినట్లు వార్తలు వస్తున్నాయి.

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో

కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో

సీనియర్ దర్శకుడు కేఎస్ రవికుమార్, బాలయ్య కాంబినేషన్ లో గత ఏడాది జైసింహా చిత్రం వచ్చింది. సంక్రాంతి సీజన్ లో విడుదలైన ఈ చిత్రం కమర్షియల్ గా మంచి విజయమే సాధించింది. దీనితో బాలయ్య ఆ దర్శకుడిపై మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. జైసింహా చిత్రాన్ని నిర్మించిన సి కల్యాణే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X