కలెక్షన్ల పోస్టర్స్ గుట్టు రట్టు.. కేవలం వారి కోసమే అంటూ బాంబు పేల్చిన నిర్మాత

ఈ మధ్య కాలంలో ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సినిమాల రూపు రేఖలు మాదిరిపోయాయి. ఒకప్పుడు సినిమా థియేటర్స్ లో ఆడే లాంగ్ రన్ బట్టి వాటి ఫలితాలు అంచనా వేసేవారు కానీ ఇప్పుడు పరిస్థితులు ఇలా లేవు. పూర్తిగా భిన్నంగా మారిపోయి కేవలం ఆ సినిమా ఎంత వసూలు చేసింది అనే దాని బట్టి హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ లాంటివి వినిపిస్తున్నాయి.

కాగా సినిమాలకి వచ్చే వసూళ్ల నంబర్స్ గేమ్ కూడా ఎప్పటికప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అలా అభిమానుల్లో కూడా తరచూ వసూళ్ల కోసం నంబర్స్ తో ఫ్యాన్ వార్స్ కూడా జరుగుతున్నాయి. ఇది ఎప్పుడు నుంచో ఉంది కానీ ప్రస్తుతం మాత్రం ఓ వైరల్ లా దారుణంగా కొనసాగుతుంది. దీనితో నిర్మాతలు కూడా పలు చిత్రాలకి రికార్డు వసూళ్లు డే 1 నుంచే ఇవ్వడం స్టార్ట్ చేస్తున్నారు.

here is the truth behind tollywood movies hundereds of crores posters

మెయిన్ గా ఏ స్టార్ హీరో సినిమా వచ్చినా డే 1 నుంచి వసూళ్ల పోస్టర్స్ పడనిదే అభిమానులకి నిద్ర పట్టడం లేదు. టాక్ తో సంబంధం లేకుండా వచ్చే పోస్టర్స్ చూసి చాలా మందికి డౌట్స్ కూడా రావచ్చు కానీ ఈ పోస్టర్స్ ప్రవాహం మాత్రం టాలీవుడ్ లో ఆగడం లేదు. అలా ఇటీవల కల్కి 2898 ఎడి, దేవర లాంటి మాసివ్ ప్రాజెక్ట్ లకి చూసాము. వీటి పరంగా కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కొట్టుకు చస్తున్నారు.

ఇలా పోస్టర్స్ మాత్రం బాక్సాఫీస్ పెర్ఫామెన్స్ ఒరిజినల్ గా ఎలా ఉన్నప్పటికీ వాటికి సంబంధం లేకుండా వచ్చేస్తున్నాయని చెప్పొచ్చు. కాగా ఈ పోస్టర్స్ విషయంలో టాలీవుడ్ నిర్మాత బాంబు పేల్చారు. దేవర సినిమాని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రముఖ నిర్మాత నాగ వంశీ సినిమా వసూళ్ల పరంగా జరిగే గుట్టు బయట పెట్టారు. మేము వసూళ్ల పోస్టర్స్ కేవలం అభిమానుల ఆనందం కోసమే వేస్తామని రివీల్ చేశారు.

here is the truth behind tollywood movies hundereds of crores posters

అంటే ఇందులో ఫ్యాన్స్ ఎమోషన్స్ కోసం తప్పితే నిజంగా ఆ సినిమాకి అంత వచ్చాయని చెప్పడానికి లేదు. సో ఇకనైనా ఫ్యాన్స్ అదే పోస్టర్స్ ని నిజం అని నమ్మితే అది వారి అవివేకమే అవుతుంది అని చెప్పొచ్చు. ఇక్కడ నుంచి అయినా ఈ పోస్టర్స్ విషయంలో నిజాన్ని గ్రహించి తమ ఎమోషన్స్ ని తగ్గించుకోవాలి. గతంలో కూడా ఈ పోస్టర్స్ పరంగా టాలీవుడ్ లో చర్చ వచ్చింది.

అంతెందుకు కొన్నేళ్ల కితమే అల వైకుంఠపురములో సినిమాకి అప్పట్లోనే ఊహించని నెంబర్ ని వేసి షాకిచ్చారు. సో ఈ పోస్టర్స్ నంబర్స్ నే గుడ్డిగా నమ్మితే వారి అవివేకమే అనుకోవాలి. మరి టాలీవుడ్ లో దారుణంగా మాతుకుపోయిన ఈ ట్రెండ్ ఎప్పటికైనా ఆగుతుందా లేక కొనసాగుతుందా అనేది చూడాలి. అన్నట్టు నాగ వంశీ మాత్రం తెలుగులో హక్కులు తాను కొన్నాను డిస్ట్రిబ్యూటర్ గా తాను తన నుంచి కొన్ని ఇతర ఎగ్జిబిటర్స్ అంతా హ్యాపీగా ఉన్నామని దేవర విషయంలో మరో అసలు విషయం రివీల్ చేశారు.

More from Filmibeat

Read more about: naga vamsi devara ntr
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X