»   » పవన్ స్టైల్: వరుణ్ తేజ్-సాయి పల్లవికి మీ రేటింగ్ ఎంత? (ఫోటోస్)

పవన్ స్టైల్: వరుణ్ తేజ్-సాయి పల్లవికి మీ రేటింగ్ ఎంత? (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తక్కువ కాలం లో, విన్నూత్నమైన సబ్జక్ట్స్ ఎంచుకుంటూ తనదైన ఐడెంటిటీ సంపాదించుకున్నారు. అటు యువతను ఇటు ఫామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే చక్కటి కథా బలం ఉన్న చిత్రాలను తీసే దర్శకుడు శేఖర్ కమ్ముల. ఇప్పుడు వీరిద్దరి తో, ఉత్తమ కథా చిత్రాల నిర్మాత గా పేరు ఉన్న దిల్ రాజు త్వరలో ఒక చిత్రాన్ని ప్రారంభించబోతున్నారు.

ఈ చిత్రం ద్వారా తమిళ బ్యూటీ సాయి పల్లవి తెలుగు తెరకు పరిచయం కాబోతోంది. మళయాలం మూవీ 'ప్రేమం'తో సాయి పల్లవి బాగా ఫేమస్ అయింది. సినిమా ప్రారంభానికి ముందు హీరో హీరోయిన్లతో కలిసి సినిమాను ఎలా తీయబోతున్నాం అనే విషయమై శేఖర్ కమ్ముల చర్చించారు. అందుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ అయ్యాయి.

ఒక అమెరికా అబ్బాయి, తెలంగాణా అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథే ఈ చిత్రం. ఇంకా టైటిల్ ఖరారు కాలేదు. నిర్మాత దిల్ రాజు ఈ సినిమా గురించి మాట్లాడుతూ, "శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రం. త్వరలో షూటింగ్ ప్రారంభం అవుతుంది", అని తెలిపారు.

స్లైడ్ షోలో ఫోటోస్...

వరుణ్ తేజ్-సాయి పల్లవి

వరుణ్ తేజ్-సాయి పల్లవి

వరుణ్ తేజ్-సాయి పల్లవి కలిసి నటించడం ఇదే తొలిసారి. ఈ జంటకు మీరు ఎంత రేటింగ్ ఇస్తారో? కామెంట్ బాక్సులో తెలపండి.

పవర్ స్టార్ మ్యానరిజం

పవర్ స్టార్ మ్యానరిజం

ఏంటి దర్శకుడు సాయి పల్లవికి పవన్ కళ్యాణ్ మ్యానరిజం నేర్పిస్తున్నాడు? సినిమాలో ఇలాంటి సీన్లు ఉంటాయా? ఏంటి?

త్వరలో

త్వరలో

త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ప్రారంభం కాబోతోంది.

దిల్ రాజు

దిల్ రాజు

శేఖర్ కమ్ముల ఒక వండర్ఫుల్ స్టొరీ టెల్లర్. వరుణ్ తేజ్ ఇప్పటికే మంచి ఆర్టిస్ట్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. అమెరికా లో ఉండే ఒక అబ్బాయి కి , తెలంగాణా లో పెరిగిన ఒక అమ్మాయి కి మధ్య జరిగే ప్రేమ కథ ఈ చిత్రమని తెలిపారు.

English summary
The pre-production works of Varun Tej's next film with Sekhar Kammula are under way and a workshop for the lead pair happened today and the pictures of Sai Pallavi and Varun released from the session, gives us the first glance at the pair.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu