ప్రభాస్‌‌కు ఎక్కువవుతున్న సమస్య.. ఏకంగా 50 ఉన్నాయట, అవి లేకుండా కష్టం!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ బాహుబలితో దేశవ్యాప్తంగా తిరుగులేని స్టార్ డమ్ సొంతం చేసుకున్నాడు. బాలీవుడ్ హీరోలకు సమానమైన క్రేజ్ ప్రభాస్ కు ఉంది. బాహుబలి రెండు భాగాలు తెచ్చిపెట్టిన క్రేజ్ తో ప్రభాస్ రాస్తుతం దూసుకుపోతున్నాడు. ఇక పై తాను నటించే చిత్రాలని నార్త్ లో కూడా విడుదల చేయబోతున్నాడు. ప్రభాస్ ప్రస్తుతం సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అభిమానుల తాకిడి ప్రతి హీరోకు ఉండే సమస్యే. చాలా మంది హీరోలు అభిమానుల తాకిడి ఎదురవుతున్నా ఓపిగ్గా భరిస్తారు. ప్రభాస్ కు ఈ సమస్య మరింతగా ఎక్కువవుతోంది.

ఎక్కడకు వెళ్లినా

ఎక్కడకు వెళ్లినా

బాహుబలికి ముందువరకు ప్రభాస్ తెలుగు రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైన హీరో. బాహుబలి చిత్రం తరువాత ఊహించని స్థాయిలో క్రేజ్ పెరిగింది. దీనితో ఇండియాలోనే కాదు విదేశాల్లో సైతం ప్రభాస్ కు అభిమానుల తాకిడి ఎక్కువవుతోందట. అభిమానులు గుంపులుగా వచ్చి సెల్ఫీలు, ఫోటోల కోసం మీద పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.

 ఏకంగా 50 ఉన్నాయట

ఏకంగా 50 ఉన్నాయట

సరదాగా బయటకు వెళ్లినా, విమానాశ్రయాల్లో ఉన్నా అభిమానులు ఎక్కువగా ఇబ్బంది పెడుతుండడంతో ప్రభాస్ ఓ ఉపాయం కనుగొన్నట్లు తెలుస్తోంది. ముక్కు నుంచి మెడ భాగం వరకు దాచి ఉంచే బ్యాండనాస్ వాడుతున్నట్లు తెలుస్తోంది. అదే విధంగా క్యాప్ కూడా ధరిస్తాడట. ఇవి ధరిస్తే అభిమానులు గుర్తు పట్టడం కష్టం. దీనితో తాను స్వేచ్ఛగా బయట తిరుగుతున్నానని ప్రభాస్ చెబుతున్నాడు. ప్రస్తుతం ప్రభాస్ ఈ బ్యాండనాస్ 50, క్యాప్స్ 60 ఉన్నాయట.

సాహో చిత్రంలో

సాహో చిత్రంలో

సాహో చిత్ర ఫస్ట్ లుక్ లో ప్రభాస్ ముఖాన్ని దాచి ఉంచుతూ బ్యాండనా ధరించి కనిపిస్తున్నాడు. సాహో చిత్రంలో ప్రభాస్ అంతర్జాతీయ వజ్రాల దొంగగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. సుజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. 200 కోట్ల బడ్జెట్ తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. జరుగుతున్న ప్రచారం ప్రకారం అన్ని భాషల్లో కలిపి ఈ చిత్ర శాటిలైట్ హక్కులు 70 కోట్లకు అమ్ముడైనట్లు తెలుస్తోంది.

సాహో తర్వాత ప్రేమకథ

సాహో తర్వాత ప్రేమకథ

సాహో చిత్రం తర్వాత ప్రభాస్ నుంచి ప్రేమకథా చిత్రం రాబోతోంది. రాధాకృష్ణ దర్శత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. 1960 నేపథ్యంలో సాగే ప్రేమకథగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్ర షూటింగ్ ప్రారంభమైంది. సాహో వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. సాహోలో శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X