మెగాస్టార్ చిరు మైండ్ బ్లోయింగ్ లుక్... (150 మూవీ దివాళీ పోస్టర్స్)
హైదరాబాద్: మెగాస్టార్ చిరంజీవి... వయసు 60 సంవత్సరాలు పైబడినా నవయువకుడిలా వెలిగిపోతున్నారు. దీపావళి సందర్భంగా అభిమానులకు విషెస్ చెబుతూ చిరంజీవి నటిస్తున్న 150వ మూవీ 'ఖైదీ నెం. 150' పోస్టర్లు రిలీజ్ చేసారు. సినిమా ఫిజిక్ పరంగా, లుక్ పరంగా ఆయన్ను చూసిన వారెవరైనా ఆయన వయసు 60 దాంటింది అంటే నమ్మకడం కష్టం.
దర్శకుడు వివి వినాయక్ మెగా అభిమానులు, ప్రేక్షకులును ఊహించిన దానికంటే ఎక్కువగానే హ్యాండ్సమ్ గా మెగాస్టార్ ను ఈ సినిమాలో చూపించబోతున్నారు. చిరంజీవి అంటేనే కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. ఒకప్పుడు ఆయన తెలుగు తెరపై తనదైన స్టైల్, డాన్స్, యాక్షన్స్ తో అదరగొట్టారు. ఆయన 150వ సినిమా కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఉండబోతోంది.

అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా
అభిమానుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు వివి వినాయక్.

యువ హీరోలకు తీసిపోకుండా
ఈ సినిమాలో ఈ తరం యువ హీరోలకు ఏ మాత్రం తీసి పోకుండా తన అభిమానులను, ప్రేక్షకులను ఎంటర్టెన్ చేయబోతున్నారు మెగాస్టార్.

రామ్ చరణ్
ఈ చిత్రాన్ని చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ కొణిదెల ప్రొడక్షన్స్ బేనర్లో నిర్మిస్తున్నారు.

ఖైదీ నెం 150: లారెన్స్ వచ్చాడు, చిరుతో అదిరే స్టెప్స్ వేయిస్తున్నాడు
ఈ సినిమాలో చిరంజీవి అదిరిపోయే డాన్స్ తో అభిమానులను అలరించబోతున్నాడు. మెగాస్టార్ తో దిరిపోయే స్టెప్స్ వేయించడానికి ప్రముఖ డాన్స్ మాస్టర్ లారెన్స్ రంగంలోకి దిగారు. స్పెషల్ సాంగులో లక్ష్మీరాయ్ చిరంజీవితో కలిసి సూపర్ హాట్ గా కనిపించబోతోంది.



Click it and Unblock the Notifications











