»   » చైతన్య సమంతల పెళ్ళి కార్డు రెడీ అయిపోయింది: ఇదిగో చూసేయండి

చైతన్య సమంతల పెళ్ళి కార్డు రెడీ అయిపోయింది: ఇదిగో చూసేయండి

Posted By:
Subscribe to Filmibeat Telugu

అంతా అనుకున్నట్టుగానే నాగచైతన్య సమంత వివాహం అక్టోబర్ లోనే ఫిక్స్ అయింది. అక్టోబర్ ఆరున మా పెళ్లి అంటూ నాగచైతన్య ప్రకటించేశాడు. జియో ఫిలిం ఫేర్ అవార్డులకు హాజరైన చైతూ అక్కడ ఓ ఇంటర్వ్యూ లో ఈ విషయం చెప్పాడు. చైతూ సమంత ల నిశ్చితార్ధం జనవరి లో జరిగిన సంగతి తెలిసిందే. వీరి పెళ్లి ఎలా జరగబోతుందో..వీరి వెడ్డింగ్ కార్డు ఎలా ఉంటుందో అని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. అక్టోబర్ 6, 7 తేదీల్లో వీళ్ల వివాహం జరగనుంది.

చైతూ సమంత

చైతూ సమంత

సమంత పెళ్లి బట్టలను ప్రముఖ డిజైనర్ క్రిషా బజాజ్ డిజైన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక సమంత పెళ్లి చీర గురించి ఒక ఆసక్తికరమైన సంగతి తెలిసిందే. అదేంటంటే సామ్ పెళ్లిరోజు కట్టుకోబోయే చీర చైతు అమ్మమ్మది అట, అంటే ప్రముఖ నిర్మాత డి. రామానాయుడు భార్య రాజేశ్వరిది.

అలనాటి చీర

అలనాటి చీర

ఈ చీరను క్రిషా తనదైన స్టయిల్ లో మార్పులు చేస్తూ చీరపై బంగారు జరీ అంచు సొగసులు అద్దుతూ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గుపాటి కుటుంబాలకు చెందిన అలనాటి చీరను సమంత కోసం ఇస్తున్నారు. అంటే వారి సంప్రదాయానికి విలువిస్తున్నటు తెలుస్తుంది.

చైతు సామ్ ల పెళ్లి

చైతు సామ్ ల పెళ్లి

అలానే పెళ్లి నగలు కూడా ఓ ప్రముఖ జ్యూవెలరీ సంస్థ డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నగలు డైమండ్స్, కుందన్స్ తో తయారవుతున్నట్టు తెలుస్తుంది. సో చైతు సామ్ ల పెళ్లిలో రిచ్ నెస్ తో జరుగుతున్నట్లు తెలుస్తోంది. మరి సామ్ పెళ్లి చీర చూడాలంటే.. ఆక్టోబర్ వరకు వేచి చూడాల్సిందే.

పెళ్లి శుభలేఖ

పెళ్లి శుభలేఖ

మొత్తానికి వీళ్లిద్దరి పెళ్లి శుభలేఖ సిద్ధం చేసారు ఇరు ఫ్యామిలీ పెద్దలు. గోవాలోని డబ్ల్యూ హోటల్ లో చైతన్య-శామ్ ల పెళ్లి జరగనుంది. క్రిస్టియన్ హిందూ సంప్రదాయాల్లో 2 రోజుల పాటు ఈ పెళ్లి జరగనుంది. ప్రీ-వెడ్డింగ్ వేడుకను కూడా ఈ 2 రోజుల్లోనే పూర్తిచేయాలని నిర్ణయించారు.

హైదరాబాద్ లో రిసెప్షన్

హైదరాబాద్ లో రిసెప్షన్

ఇక పెళ్లి వేడుకకు ఎక్కువ మంది కాకుండా అతి కొద్దీ మందిని మాత్రమే పిలుస్తారని సమాచారం. పెళ్లి తర్వాత హైదరాబాద్ లో జరిగే రిసెప్షన్ కు పూర్తిస్థాయిలో సినీ-రాజకీయ ప్రముఖుల్ని ఆహ్వానించాలని నిర్ణయించారు. ఇక వీరి పెళ్లి కార్డు ఎలా ఉందో మీరే చూడండి.

English summary
As per the reports, Chaitu and Sama are getting ready for their marriage on October 6th and 7th. The wedding card of Samantha and Chaitu is out. The wedding Venue is The W HOTEL, Vagator Beach, Goa.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu