twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరోయిన్ కాళ్లు పట్టుకున్న దర్శకుడు (పిక్చర్స్)

    By Bojja Kumar
    |

    ముంబై: ఓ సారి ఫ్లాష్ బ్యాక్‌లోకి వెళితే బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ అప్పట్లో ఓ అవార్డు కార్యక్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీపిక పదుకొనె కాళ్లు పట్టుకున్న సంగతి తెలిసిందే. తాజాగా అలాంటి సంఘటనే బాలీవుడ్లో చోటు చేసుకుంది. ఈసారి కరీనా కపూర్ నటిస్తున్న 'గోరీ తేరె ప్యార్ మే' షూటింగులో ఈ ఘటన చోటు చేసుకుంది.

    కాళ్లు పెట్టుకున్న వ్యక్తి ఎవరో కాదు...'గోరీ తేరె ప్యార్ మే' చిత్ర దర్శకుడు పునీత్ మల్హోత్రా. ఆమె పుట్టినరోజు సందర్భంగా పునీత్ కరీనా కాళ్లు పట్టుకున్నాడు. పునీత్ మల్హోత్ తనకు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలా వెరైటీగా చెప్పడంతో బెబో ఆశ్చర్యానికి గురైంది. మల్హోత్రా తన ట్విట్టర్ ద్వారా ఈ ఫోటోను రిలీజ్ చేసాడు. 'చూడండి, నేను కరీనా కపూర్ ఖాన్‌కి ఎలా బర్త్ డే విషెస్ చెప్పానో' అంటూ ఆ ఫోటోకు కామెంట్ కూడా పెట్టాడు.

    పునీత్ మల్హోత్రా టేబుల్ కింద దూరి కరీనా కపూర్‌కు పుట్టిన రోజు విషెస్ చెప్పిన దృశ్యాన్ని క్రింద ఉన్న స్లైడ్ షోలో చూడండి 'గోరీ తేరె ప్యార్ మే' సినిమా విషయాల్లోకి వెళితే...ఇప్పటికే ఈచిత్రం ట్రైలర్ రిలీజైంది. ఈ చిత్రంలో కరీనా, ఇమ్రాన్ ఖాన్ హీరో హీరోయిన్లు. నవంబర్ 22, 2013న చిత్రం విడుదల కానుంది.

    పునీత్ మల్హోత్రా, కరీనా

    పునీత్ మల్హోత్రా, కరీనా

    కరీనా కపూర్ టేబుల్ ముందు కుర్చీలో కూర్చోగా....ఇలా టేబుల్ కింద దూరి ఆమె కాళ్లు పట్టుకుని పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు దర్శకుడు పునీత్ మల్హోత్రా.

    రణబీర్ కపూర్, దీపిక

    రణబీర్ కపూర్, దీపిక

    బాలీవుడ్ యంగ్ హీరో రణబీర్ కపూర్ గతంలో ఓ అవార్డు ఫంక్షన్ కార్యక్రమంలో తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ దీపిక పదుకొనె కాళ్లు పట్టుకున్న దృశ్యాన్ని ఇక్కడ చూడొచ్చు.

    దీపిక షాక్...

    దీపిక షాక్...

    రణబీర్ తన కాళ్లు పట్టుకోవడం అప్పట్లో దీపిక ఒక్కసారిగా షాకైంది. గతంలో వీరిద్దరి మధ్య ప్రేమాయణం నడిచింది. అయితే ఆ తర్వాత విడిపోయారు.

    గోరీ తేరె ప్యార్ మే

    గోరీ తేరె ప్యార్ మే

    గోరీ తేరె ప్యార్ మే చిత్రం సెట్స్ లో ఆ చిత్ర దర్శకుడు పునీత్ మల్హోత్రా, హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, హీరో ఇమ్రాన్ ఖాన్.

    గోరీ తేరె ప్యార్ మే టీంతో కరణ్ జోహార్

    గోరీ తేరె ప్యార్ మే టీంతో కరణ్ జోహార్

    గోరీ తేరె ప్యార్ మే టీంతో ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ ఇలా ఫోటోలకు ఫోజు ఇచ్చాడు.

    English summary
    Remember the day when the tinselville was taken aback, after actor Ranbir Kapoor touched his ex-girlfriend Deepika Padukone's feet at an award show?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X