చాలా హర్ట్ అయ్యాను అంటూ... కామెడీ స్టార్ సునీల్ నిజస్వరూపం బయట పెట్టిన ఆకాష్!
Recommended Video
తెలుగులో స్టార్ కమెడియన్‌గా ఓ వెలుగు వెలిగిన సునీల్ ఆ తర్వాత హీరోగా కూడా ట్రై చేశాడు. మొదట్లో కొన్ని విజయాలు లభించినప్పటికీ ఆ తర్వాత వరుస ప్లాపులతో కెరీర్ అనుకున్న స్థాయిలో ముందుకు సాగలేదు. మళ్లీ ఇపుడు కామెడీ పాత్రలు చేస్తూ కెరీర్ నెట్టుకొస్తున్నారు.
'అందాల రాముడు' సినిమాతో హీరోగా తన జర్నీ మొదలు పెట్టిన సునీల్‌పై ఈ చిత్రంలో సెకండ్ హీరో పాత్ర చేసిన ఆకాష్ సంచలన కామెంట్స్ చేశాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో సునీల్ తన విషయంలో ఎలా ప్రవర్తించాడో వెల్లడించారు.

స్పెషల్ అప్పియరెన్స్ చేస్తావా అని అడిగాడు
‘పిలిస్తే పలుకుతా' మూవీలో నేను హీరోగా నటిస్తే, నా ఫ్రెండ్ పాత్రలో సునీల్ చేశాడు. ఆ సమయంలో సునీల్ నా వద్దకు వచ్చి.. ‘భయ్యా నేను హీరోగా ఓ సినిమా చేయబోతున్నాను, నా కోసం స్పెషల్ అప్పియరెన్స్ ఇస్తావా?' అని అడిగాడు. అతిథి పాత్ర కాబట్టి పాజిటివ్ ఉంటుందనుకుని ఓకే చెప్పాను.

అక్కడ సినిమా వదులుకుని వచ్చాను
నెల్లూరులో నేను సినిమా షూటింగులో ఉన్నపుడు సునీల్ ఫోన్ చేశాడు. తమిళ మూవీ సుందరభూషణ్... సూపర్ గుడ్ ఫిల్మ్స్ బేనర్లో హీరోగా చేస్తున్నాను, దాంట్లో సెకండ్ హీరో పాత్ర నా కోసం నువ్వు చేయాలి, నాకు మాట ఇచ్చావు అన్నాడు. ఆ పాత్ర అంతబావుండదు కదా అని నేనంటే.. దాన్ని ఇంకా డెవలప్ చేయిస్తాను అన్నాడు. సునీల్‌కు మాట ఇచ్చాను కాబట్టి హీరోగా తమిళంలో చేసే ఓ సినిమాను వదిలేసి ఇక్కడ వచ్చి చేశాను.

చేతులు కదు కాళ్లు అనుకో భయ్యా అన్నాడు
‘అందాల రాముడు' షూటింగ్ జరిగిన సమయంలో రోజూ సునీల్ నా వద్దు వచ్చి చేయి పట్టుకుని... ఇది కాళ్లు అనుకోభయ్యా, నువ్వు చేసిన సాయం లైఫ్ లో మరిచిపోను అని చెప్పేవాడు. అలాంటి మనిషి ఆ సినిమా రిలీజై సక్సెస్ అయిన తర్వాత నా గురించి ఒక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పలేదు. నా ఫోటోతో ఒక్క పోస్టర్ కూడా వేయలేదు. ఒక సినిమా వదలుకుని వచ్చిన నాకు ఎలా ఉంటుంది. మళ్లీ నాతో కలిసి ‘నవ వసంతం' చేసేపుడు చిన్న చూపు చూశాడు. అప్పటిదాకా భయ్యా భయ్యా అనేవాడు.... అప్పటి నుంచి ఏ ఆకాష్ అని పిలవడం మొదలు పెట్టాడు.

సునీల్ నిజస్వరరూపం తెలిసి బాధ పడ్డా
‘పిలిస్తే పలుకుతా' మూవీలో నా ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన సునీల్ సక్సెస్ వచ్చిన తర్వాత ఇలా మారిపోవడం బాధ అనిపించింది. హిందీలో హిట్ అయిన ‘పార్టర్నర్' మూవీ తెలుగులో ఇద్దరం కలిసి చేద్దాం అంటే చేయను అని చెప్పాడు. ‘అందాల రాముడు' సినిమాలో నా పాత్ర డెవలప్ చేయిస్తాను అని చెప్పిన సునీల్.... అలా చేయించలేదు. ఆ డైరెక్టర్‌ను తర్వాత అడిగితే సునీలే వద్దన్నాడు అని చెప్పాడు, సునీల్ నిజ స్వరూపం ఇదా అని తెలిసి చాలా హర్టయ్యాను... అని ఆకాష్ తెలిపారు.


Click it and Unblock the Notifications











