పుట్టినరోజు సర్ ప్రైజ్ ఇవ్వబోతున్న అఖిల్
అక్కినేని హీరోల్లో ఇంకా పూర్తి స్థాయిలో సక్సెస్ చూడని హీరో అఖిల్. ఈ స్మార్ట్ అబ్బాయి నెక్స్ట్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాతో రాబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో అఖిల్ ఎలాగైనా సక్సెస్ అవ్వాలని అక్కినేని అభిమానుకు చాలా బలంగా కోరుకుంటున్నారు. ఇక గీత ఆర్ట్స్ కూడా అఖిల్ కు హిట్టివ్వాలని పోటీగా ఉన్న సమయంలో సినిమాను అస్సలు రిలీజ్ చేయడానికి ఇష్టపడటం లేదు.
ఇక సినిమాను జూన్ 19కి షిఫ్ట్ చేసిన విషయం తెలిసిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించింది. అయితే ఆ సినిమా తరువాత అఖిల్ సురేంధర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఒప్పుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టైటిల్ ను ఈ వారం రిలీజ్ చేయనున్నారట.

ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా అప్డేట్ రానున్నట్లు సమాచారం. సైరా నరసింహా రెడ్డి లాంటి బిగ్ బడ్జెట్ సినిమా అనంతరం దర్శకుడు సురేందర్ రెడ్డి పూర్తిగా తన ట్రాక్ లోకి వచ్చేశాడు. ఈ సినిమాతో మళ్ళీ కమర్షియల్ హిట్టు కొట్టి ట్రాక్ లోకి రావాలని అనుకుంటున్నాడు. ఇక సినిమా కోసం అఖిల్ ఫీట్నెస్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చేశాడు. మరి సినిమా ఏ స్థాయిలో హిట్ అందుకుంటుందో చూడాలి.


Click it and Unblock the Notifications











