Breaking: అల్లు అర్జున్ కారావాన్ కు ప్రమాదం.. వెనుక నుంచి డీ కొట్టిన లారీ..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ విలాసవంతమైన కారావాన్ కు ప్రమాదం జరిగింది. ఒక కంటైనర్ లారీ వెనుక భాగం నుంచి డీ కొట్టినట్లు తెలుస్తోంది. అభిమానులకు ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన ఈ ఘటన ఖమ్మం సమీపంలోని సత్యనారాయణ పురం దగ్గర చోటు చేసుకున్నట్లు సమాచారం. సోషల్ మీడియాలో కూడా ప్రమాదానికి సంబంధించిన అనేక రకాల పుకార్లు వస్తున్నాయి. అయితే ఇది పెద్దగా కంగారు పడాల్సిన ప్రమాదం కాదని తెలుస్తోంది.

షెడ్యూల్ పూర్తవ్వడంతో..
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. నవంబర్ నుంచి రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో కొనసాగించగా ఇటీవల పనులన్నింటిని ఫినిష్ చేశారు. ఇక రీసెంట్ గా షెడ్యూల్ పూర్తవ్వడంతో చిత్ర యూనిట్ మొత్తం కూడా హైదరాబాద్ కు పయణమయ్యింది.

అల్లు అర్జున్ అందులో లేకపోవడంతో..
అయితే అనుకోకుండా అల్లు అర్జున్ కారావాన్ ప్రమాదానికి గురవ్వడంతో అభిమానులు షాక్ అయ్యారు. అయితే ప్రమాదం సమయంలో అల్లు అర్జున్ అందులో లేదు. పుష్ప సినిమాకు సంబంధించిన కొంతమంది మేకప్ టీమ్ సభ్యులు కారావాన్ లో ప్రయాణం చేస్తున్నట్లు సమాచారం. ఎవరికి కూడా పెద్దగా ప్రమాదం జరగలేదట.

డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఇక ఈ ఘటనపై పోలిస్ కేసు నమోదైంది. ఖమ్మం పోలీసులు కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ ను కూడా అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రమాదంలో కారావాన్ వెనుకబాగం అద్దాలు పూర్తిగా ద్వంసం అయినట్లు సమాచారం. ఇక అల్లు అర్జున్ కారావాన్ అని తెలియడంతో సమీప గ్రామ ప్రజలు ఒక్కసారిగా ఘటన స్థలం చుట్టూ చేరారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్లియర్ చేయాల్సి వచ్చింది.

హైదరాబాద్ కు వస్తుండగా..
అయితే ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. అల్లు అర్జున్ ఎయిర్ పోర్ట్ లో దింపి కారావాన్ హైదరాబాద్ కు పయనం అయినట్లు సమాచారం. ఇక ఈ వ్యాన్ పేరు అందరికి తెలిసిందే. ఫల్కన్ లవ్ అని అల్లు అర్జున్ పెట్టిన ఆ పేరు అప్పట్లో సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యింది.

కారావాన్ ఖరీదు ఎంతంటే..
ఇండియన్ సెలబ్రెటీస్ లలోనే అతికొద్దీ మందికి ఇలాంటి ఖరీదైన కారావాన్ ఉంది. దీని ఖరీదు దాదాపు 7కోట్లకు పైగానే ఉంటుందట. బన్నీ తన దగ్గర ఎప్పటి నుంచో ఉన్న నమ్మకమైన వ్యక్తిని ఈ వాన్ కు డ్రైవర్ గా పెట్టుకున్నాడు. ఇక అతనికి ఈ కారావాన్ డ్రైవింగ్ కోసమని స్పెషల్ గా డ్రైవింగ్ కూడా నేర్పించారు.

పుష్ప విషయానికి వస్తే..
ఇక పుష్ప సినిమా విషయానికి వస్తే ఇప్పటివరకు 30శాతం షూటింగ్ ను పూర్తి చేశారు. ఇటీవల సినిమా రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. సినిమా తప్పకుండా ఈ ఎడాది ఆగస్టు 13న రాబోతున్నట్లు క్లారిటీ ఇచ్చేశారు. ఇక తక్కువ సమయం ఉండడంతో దర్శకుడు సుకుమార్ అయితే స్పీడ్ పెంచినట్లు క్లారిటీగా అర్ధమయ్యింది. నవంబర్ నుంచి ఇప్పటివరకు రెండు కీలకమైన షెడ్యూల్స్ ను రంపచోడవరం, మారేడు మిల్లి ప్రాంతాల్లో ఫినిష్ చేశారు.


Click it and Unblock the Notifications











