స్వయంగా రోజానే వెళ్లి ఆ హీరోతో..! ఆమె భర్తకే ఛాలెంజ్ విసిరిన సీనియర్ హీరో..

సీనియర్ హీరోయిన్ రోజా, సీనియర్ హీరో అర్జున్ ఇద్దరూ కలిసి భావితరాలకు ఉపయోగకరమైన పని చేశారు. భావితరాల కోసం తమ వంతు సహకారం అందించారు. ఈ నేపథ్యంలో హీరో అర్జున్, రోజా భర్తకే ఛాలెంజ్ విసిరి ఆ కార్యక్రమాన్ని మరింత ఆసక్తికరంగా మలిచారు. ఇంతకీ రోజా, అర్జున్ సమాజహితం కోసం చేసిన ఆ పని ఏంటి? వివరాల్లోకి పోతే..

Recommended Video

Senior Hero Challenges MLA Roja Husband || Filmibeat Telugu
పర్యావరణ పరిరక్షణకై.. ఎందరో సినీరాజకీయ ప్రముఖులు

పర్యావరణ పరిరక్షణకై.. ఎందరో సినీరాజకీయ ప్రముఖులు

గత కొంతకాలంగా 'గ్రీన్ ఛాలెంజ్' హవా నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణకై మొక్కలు నాటాలనే సదుద్దేశంతో నడుస్తున్న ఈ ఛాలెంజ్‌ని పలువురు సెలెబ్రిటీలు సాదరంగా స్వాగతిస్తున్నారు. టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్‌ రోజు రోజుకూ విస్తరిస్తుండటం అభినందనీయం. ఇప్పటికే ఎందరో సినీరాజకీయ ప్రముఖులు ఈ కార్యక్రమంలో భాగమై మొక్కలు నాటిన సంగతి తెలిసిందే.

సినీ నటి రోజా.. ‘రోజా వనం’

సినీ నటి రోజా.. ‘రోజా వనం’

ఇదే గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్ఫూర్తితో సినీ నటి, ఎమ్మెల్యే రోజా.. ‘రోజా వనం' అనే కార్యక్రమం చేపడుతోంది. ఇందులో భాగంగా స్వయంగా వెళ్లి హీరో అర్జున్‌ని కలిసింది రోజా. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా అర్జున్‌తో మొక్కలు నాటించింది రోజా .

రోజా భర్తకు ఛాలెంజ్..

గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజా వనం సంయుక్తంగా నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా ఆదివారం రోజు మూడు మొక్కలు నాటారు హీరో అర్జున్. ఈ మేరకు మరో ముగ్గురిని నామినేట్ చేశారు. అందులో టాలీవుడ్ నటుడు జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు రోజా భర్త ఆర్కే సెల్వమణి, నటి ఖుష్బూలను నామినేట్ చేస్తూ ఛాలెంజ్ విసిరారు అర్జున్.

రోజా సంకల్పం గొప్పది: అర్జున్

రోజా సంకల్పం గొప్పది: అర్జున్

ఈ సందర్భంగా హీరో అర్జున్ మాట్లాడుతూ.. ‘‘భవిష్యత్ తరాలకు మేలు కలిగేలా, భావితరాలకు మంచి ఆక్సిజన్ అందించాలనే రోజా సంకల్పం చాలా గొప్పది. ఆమె ఇలా మొక్కలు నాటించే కార్యక్రమం చేపట్టడం అభినందనీయం. ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్, రోజావనంలో జగపతిబాబు, ప్రముఖ దర్శకుడు, రోజా భర్త ఆర్కే సెల్వమణి, నటి ఖుష్బూ పాల్గొనాలని వారికి ఛాలెంజ్ విసురుతున్నాను'' అన్నారు.

రోజాకు టీఆర్ఎస్ ఎంపీ అభినందనలు


మరోవైపు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ రూపకర్త, టీఆర్ఎస్ ఎంపీ సంతోష్ కూడా రోజా గారు మొక్కలు నాటించడం గొప్ప శుభపరిణామం అని ఆమెను ప్రత్యేకంగా అభినందించారు. ఇప్పటికే ఈ కార్యక్రమంలో సినీ నటులు మంచు లక్ష్మి, సాయి పల్లవి, వరుణ్ తేజ్, సుమ పాల్గొని మొక్కలు నాటారు. అలాగే పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటి వరకు వచ్చిన ఛాలెంజిల్లో ఈ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మంచి పేరుతో పాటు భారీ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X