నా కూతురు కూడా ఉంది.. అడ్డదారిలో వెళితే, కాస్టింగ్ కౌచ్ గురించి అర్జున్ సంచలన వ్యాఖ్యలు!
Recommended Video

తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో కాస్టింగ్ కౌచ్ గురించి హాట్ హాట్ గా చర్చ జరుగుతోంది. సంబంధం ఉన్న లేకున్నా ప్రతి ఒక్క నటుడు ఈ వివాదం గురించి స్పందించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తాజగా హీరో అర్జున్ కాస్టింగ్ కౌచ్ వివాదం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీరెడ్డి వ్యవహారంతో కాస్టింగ్ కౌచ్ గురించి మీడియాలో చర్చలు జరుగుతున్నాయి. కాస్టింగ్ కౌచ్, తన కుమార్తె ఐశ్వర్య అర్జున్ గురించి అర్జున్ సంచలన వ్యాఖ్యకు చేశాడు.

నిజమే
చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ ఉన్న మాట వాస్తవమే అని హీరో అర్జున్ తెలిపాడు. కానీ కేవలం చిత్ర పరిశ్రమలో మాత్రమే కాక అన్ని రంగాల్లో కాస్టింగ్ కౌచ్ ఉందని అర్జున్ తెలిపాడు. అందరికి దృష్టి సినిమాపైనే ఉండడంతో చర్చ జరుగుతోందని అన్నాడు.

చెడు మార్గం
ప్రతి చోట మంచి చెడు రెండూ ఉంటాయి. మంచి మార్గం ఎంచుకుంటే మనల్ని ఎవరూ అడ్డుకోలేరు. కానీ చెడు మార్గం ఎంచుకుంటే అది వారి దురదృష్టం మాత్రమే అని అర్జున్ తెలిపాడు.

నా కూతురు
ఇండస్ట్రీలో ఏదో జరుగుతోందని నేను భయపడాలా. నా కూతుర్ని ఇండస్ట్రీకి రానివ్వకుండా అడ్డుకోవాలా అని అర్జున్ ప్రశ్నించారు. సినిమాలతో సంబంధం లేనివారు కూడా వారి కుమార్తెలని ఇండస్ట్రీలోకి రాణిస్తున్నారుగా. వారికి పరిస్థితి ఏంటి.

నలభై ఏళ్ల నుంచి
నలభై ఏళ్ల నుంచి నేను ఇండస్ట్రీలో ఉంటున్నా. ఇక్కడేం జరుగుతుందో నాకు తెలుసు. చెడుగా ఆలోచించే వారు చెడు మార్గంలోనే వెళతారు. నా కూతురి విషయంలో నేనెందుకు భయపడాలి అని అర్జున్ తెలిపారు. అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ సినిమాల్లో నటిస్తోంది.

శ్రీరెడ్డి వ్యవహారం
ఇండస్ట్రీలో ఇంతలా కాస్టింగ్ కౌచ్ గురించి చర్చకు కారణం శ్రీరెడ్డి అని చెప్పొచ్చు. తెలిసి కూడా ఎందుకు ఆ మార్గాల్లో వెళుతున్నారని ప్రశ్నలు శ్రీరెడ్డికి ఎదురవుతుంటేడ్, శ్రీరెడ్డి మాత్రం మోసం చేస్తున్నారని ప్రముఖులపై ఆరోపణలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











