For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  స‌హ‌జీవ‌నం అంటే సెక్స్.. ‘ఇష్టంగా’ ఇంకేదో ఊహించుకుంటారు.. రికార్డు ముద్దు సీన్

  |

  ఏవీఆర్ మూవీ వండర్స్ పతాకంపై సంపత్ వీ రుద్ర‌ దర్శకత్వంలో అడ్డూరి వెంకటేశ్వరరావు నిర్మిస్తొన్న చిత్రం ఇష్టంగా. అర్జున్ మహి, తనిష్క్ రాజన్ జంటగా నటిస్తున్నారు. రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. స్టార్ క‌మెడియ‌న్ ప్రియదర్శి ఓ ముఖ్య పాత్ర పొషిస్తున్నారు. డిసెంబర్ 28న సినిమా విడుదలవుతోంది‌.

  టాలీవుడ్‌లో సుదీర్ఘమైన ముద్దు సీన్

  టాలీవుడ్‌లో సుదీర్ఘమైన ముద్దు సీన్

  ఇష్టం చిత్రం పూర్తిగా యూత్ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా రూపొందుతున్నది. భారీ సంఖ్యలో లిప్‌లాక్స్ ఉన్నాయి. అంతేకాకుండా తెలుగు సినిమాలోనే సుదీర్ఘమైన ముద్దు సీన్ ఉన్నట్టు సినీ వర్గాల్లో టాక్ నడుస్తున్నది. ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి. ఈ సందర్బంగా ఓ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు.

  స‌హ‌జీవ‌నం అంటే ఏదో..

  స‌హ‌జీవ‌నం అంటే ఏదో..

  హీరో అర్జున్ మ‌హి మాట్లాడుతూ-``ఒక వెబ్‌సైట్‌లో ప‌ని చేసే కంటెంట్ రైట‌ర్ హీరోని ప్రేమిస్తుంది. బాధ్య‌త‌లేని కుర్రాడితో ప్రేమ‌లో ప‌డినా ప్రేమ స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని క‌థానాయిక పాత్ర నిరూపిస్తుంది. అమ్మాయి- అబ్బాయి స‌హ‌జీవ‌నం అంటే సెక్స్ లేదా ఇంకేదో ఊహించుకుంటారు. కానీ అంత‌కుమించి అని తెర‌పై చూస్తారు. వినోదంతో పాటు సందేశం ఆక‌ట్టుకుంటుంది. అవ‌కాశం క‌ల్పించిన‌ నా ద‌ర్శ‌క‌నిర్మాత‌లకు, ప్రోత్స‌హించిన నాన్న గారికి ధ‌న్య‌వాదాలు. ఈ సీజ‌న్‌లో ఓ చ‌క్క‌ని రొమాంటిక్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌ని ప్రేక్ష‌కుల‌కు అందిస్తున్నాం. విజ‌యం అందుకుంటాం`` అన్నారు.

  కథాబలంతో ఇష్టంగా

  కథాబలంతో ఇష్టంగా

  క‌థానాయిక త‌నిష్క్ మాట్లాడుతూ.. ఇష్టంగా కథాబలం ఉన్న చిత్రం. నా పాత్ర కు చాలా ప్రాధాన్యత ఉంది. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అన్నారు.

  న‌టుడు దువ్వాసి మోహ‌న్ మాట్లాడుతూ-``ప్ర‌తి నిత్యం ఇష్టంగా ఎన్నో చేస్తుంటాం. ఆ ఇష్టాన్ని టైటిల్‌గా పెట్టుకున్నారు. సంపత్ వి.రుద్ర ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడ‌వ్వ‌డంతో అంచ‌నాలు పెరిగాయి. ప్రియ‌ద‌ర్శితో పాటు న‌టించాను. న‌వ‌త‌రం నాయ‌కానాయిక‌లు చ‌క్క‌గా న‌టించారు. ఈ సినిమాకి ర‌చ‌న‌, సంగీతం, సినిమాటోగ్ర‌ఫీ ప్ర‌తిదీ బాగా కుదిరాయి. నిర్మాత‌లు అభిరుచితో సినిమా తీశారు. పెద్ద విజ‌యం సాధిస్తుంద‌న్న ధీమా ఉంది అన్నారు.

   కొత్తవారిని ప్రోత్సాహిస్తే బ్రహ్మండంగా

  కొత్తవారిని ప్రోత్సాహిస్తే బ్రహ్మండంగా

  నిర్మాత వెంక‌టేశ్వ‌ర‌రావు మాట్లాడుతూ-``కొత్త‌వారిని ప్రోత్స‌హిస్తే మంచి సినిమాలు వ‌స్తాయి. ఈ సినిమాని భారీగా రిలీజ్ చేస్తున్నాం. న‌టీన‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌, సాంకేతిక నిపుణుల ప‌నిత‌నం తెర‌పై ఆక‌ట్టుకుంటాయి. అంద‌రి ప్రోత్సాహానికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.

  నిర్మాత రాజీ పడకుండా

  నిర్మాత రాజీ పడకుండా

  ద‌ర్శ‌కుడు సంప‌త్.వి.రుద్ర‌ మాట్లాడుతూ-`` ఇది తొలి చిత్రం. 30రోజుల్లో పూర్తి చేయాల‌నుకున్న ఈ సినిమా కాన్వాసు మారి, బ‌డ్జెట్ పెరిగింది. అందుకు త‌గ్గ‌ట్టే ప్రామిస్సింగ్ కంటెంట్‌, విజువ‌ల్స్‌తో సినిమా తెర‌కెక్కించాం. నిర్మాత రాజీకి రాకుండా కావాల్సినవి స‌మ‌కూర్చారు. గోవాలో 10రోజుల పాటు సినిమాను చిత్రీక‌రించాం. లొకేష‌న్స్ ప‌రంగా రాజీకి రాకుండా తీశాం. సినిమాటోగ్ర‌ఫీ, శ్రీ‌నాధ్ డైలాగులు ఆక‌ట్టుకుంటాయి. హీరో-హీరోయిన్ డెడికేష‌న్ మైమ‌రిపిస్తుంది. పెద్ద విజ‌యం అందుకుంటాం అని అన్నారు.

  నటీనటులు, సాంకేతిక వర్గం

  నటీనటులు, సాంకేతిక వర్గం

  అర్జున్ మహి, తనిష్క్ రాజన్, ప్రియదర్శి, దువ్వాసి మోహన్, తాగుబోతు రమేష్, మధునందన్, మధుమణి, విశ్వేష్వర్ నెమిలకొండ, ఫిష్ వెంకట్ తదితరులు
  రచన సహకారం: చిట్టి శర్మ
  సినిమాటోగ్రఫీ: ఆనంద్ నడకట్ల డిఎఫ్ ఎమ్
  సంగీతం: యేలేంద్ర మహావీర్
  కూర్పు: బొంతల నాగేశ్వర్ రెడ్డి
  మాటలు: శ్రీనాధ్ బాదినేని
  పాటలు: కందికొండ
  రాంబాబు గోశాల, అలరాజు
  ఆర్ట్: విజయ్ కృష్ణ
  ఫైట్స్: షావలిన్' మల్లేష్
  పి.ఆర్.ఓ: సాయి సతీష్
  నిర్మాత : అడ్డూరి వేంకటేశ్వర రావు
  కథ- స్క్రీన్ ప్లే - దర్శకత్వం: సంపత్ .వి.రుద్ర‌

  English summary
  Ishtam ga movie is a cute love story with living relationship story. Arjun Mahi, Tanishq are lead pair. Sampath V rudra is the director. This movie set to release on December 28th.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X