నాలుగు సార్లు శంకర్ ని వెళ్లిపొమ్మని చెప్పా.. కానీ ఐదవసారి!
సీనియర్ హీరో అర్జున్ కెరీర్ లో జెంటిల్ మాన్ చిత్రం మరపురాని సినిమాగా మిగిలిపోతుంది. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరక్కించిన ఆ చిత్రం చరిత్ర సృష్టించింది. ఆ చిత్రానికి సంబందించిన మధురమైన జ్ఞాపకాన్ని అర్జున్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. తాను వరుస పరాజయాల్లో ఉన్న సమయంలో ఎవరూ తనని పట్టించుకోవడం లేదనే కోపంతో ఉన్నానని అర్జున్ తెలిపారు.
ఆ సమయంలో ఓ కుర్రాడు తనవద్దకు కథ తీసుకుని వచ్చాడు. కోపంతో ఉండడం వలన నాలుగుసార్లు వెనక్కు పంపేశా. కానీ ఐదవసారి ఆ కుర్రాడే తనవద్దకు వచ్చి కథ వినకుండా వెళ్లిపొమ్మని చెప్పడం సరిదని చెప్పాడు. కథ చెప్పాకైనా నో చెబితే ఇక రాడులే అని భావించా.

కానీ కథ విన్నాకా నో చెప్పలేకపోయా అని అర్జున్ తెలిపారు. అదే జెంటిల్ మాన్ చిత్ర కథ అని, ఆ కుర్రాడే దర్శకుడు శంకర్ అని తెలిపాడు. అంతటి గొప్ప దర్శకుడు నా చిత్రంతో పరిచయం అయ్యాడని ఎప్పుడూ గర్వంగా ఫీలవుతుంటానని అర్జున్ తెలిపారు.


Click it and Unblock the Notifications











