twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శుభం:ఈ నెల్లోనే తెలుగు యంగ్ హీరోకు పెళ్లి,...డిటేల్స్

    By Srikanya
    |

    హైదరాబాద్: బి. జయదర్శకత్వంలో 'చంటిగాడు' చిత్రంతో హీరోగా పరిచయమైన బాలాదిత్యకు ఆ సినిమా మంచి బ్రేక్‌నిచ్చింది. ఆ తర్వాత 'రూమ్‌ మేట్స్‌', '1940లో ఒక గ్రామం' , సుందరానికి తొందరెక్కువ వంటి చిత్రాలు కూడా ఆయనకు చక్కటి పేరు తెచ్చి పెట్టాయి.

    చైల్డ్ ఆర్టిస్ట్ గానూ బాగా పాపులర్ అయిన ఈయన ప్రస్తుతం ఛాంపియన్ అనే ఈటీవి షో ని హోస్ట్ చేస్తున్నారు. అలాగే ఈ నెల్లోనే వివాహం చేసుకోబోతున్నారు. ఆయన చేసుకోబోయే అమ్మాయి పేరు మానస.

    ఆగస్టు 6న వైజాగ్ లో ఈ జంట ఒకటి కాబోతోంది. వివాహానంతరం సినీ పరిశ్రమలోని తన పరిచయస్దులకు హైదరాబాద్ హోటల్ తాజ్ మహల్ హోటల్ లో గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తున్నారు. ఇది పెద్దలు కుదిర్చిన వివాహం.

    కెరీర్ విశేషాలకు వెళ్తే...బాలాదిత్య 'ఎదురింటి మొగుడు పక్కంటి పెళ్లాం' సినిమాతో బాలనటుడిగా సినీ రంగానికి పరిచయమయ్యారు. తండ్రికి తగ్గ కొడుకుగా, పిసినారి పిల్లాడిగా రాజేంద్రప్రసాద్‌ నటనను అనుకరిస్తూ, ఆయనకు ఎదురుగా నిలబడి నటించి ఆయన చేత 'స్టాంపు' అని పిలిపించుకున్న చిచ్చరపిడుగుబాలాదిత్య.

    Hero Baladitya found his life partner !!

    ఆ చిత్రం తరువాత 'అన్న', 'లిటిల్‌ సోల్జర్స్‌', 'బంగారు బుల్లోడు', 'హిట్లర్‌', 'అబ్బాయిగారు', 'ఏవండీ ఆవిడ వచ్చింది', 'హలోబ్రదర్‌' వంటి చిత్రాల్లోనూ బాల నటుడిగా మెప్పించారు. బి. జయదర్శకత్వంలో 'చంటిగాడు' చిత్రంతో హీరోగా పరిచయమైన బాలాదిత్యకు ఆ సినిమా మంచి బ్రేక్‌నిచ్చింది.

    ఆ తర్వాత 'రూమ్‌ మేట్స్‌', '1940లో ఒక గ్రామం' వంటి చిత్రాలు కూడా ఆయనకు చక్కటి పేరు తెచ్చి పెట్టాయి. ఆరేళ్లకు బాలనటుడిగా కెరీర్‌ను ప్రారంభించిన బాలాదిత్య 'అన్న', 'లిటిల్‌ సోల్జర్స్‌' చిత్రాలకు నంది అవార్డు అందుకున్నారు. 18 ఏళ్లకే ఆయన హీరోగా నటించిన '1940లో ఒక గ్రామం' చిత్రానికి జాతీయ అవార్డు రావడం గమనార్హం.

    English summary
    Hero Balaaditya has found his life partner in the name of Manasa, and the couple are tying knot on August 6th at Vizag.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X