Balakrishna ఆ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు.. బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు

ఇండస్ట్రీలో ఎంతోమంది తారలు వస్తూ ఉంటారు పోతు ఉంటారు. కానీ, కొంతమంది మాత్రమే చరిత్రలో నిలిచిపోతారు. ఎన్ని జనరేషన్స్ మారినా వారి పేరు చెప్తే ఇట్టే గుర్తుపట్టేస్తారు. అలాంటి తారల్లో సిల్క్ స్మిత కూడా ఒకరు. ఆమె జీవితం అందరికి తెల్సిన పుస్తకమే. పైకి అలా నవ్వుతూ కనిపించినా ఆమె లోపల ఎంతలా నలిగిందో చాలా తక్కువ మందికి తెలుసు.

ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాలని సిల్క్ పడిన కష్టం అంతా ఇంతా కాదు. ఎన్ని అవమానాలు, ఎన్ని ఛీత్కారాలు.. అన్ని తట్టుకొని స్టార్ డ్యాన్సర్ గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. ఒకానొక సమయంలో సిల్క్ సాంగ్ కోసమే థియేటర్ కు వచ్చి.. ఆమె అందాలను చూసి ప్రేక్షకులు తిరిగి వెళ్లిపోయేవారట.

hero balakrishna intresting comments about actress silk smitha old video viral in social media

నిర్మాతలు సైతం సిల్క్ తో ఒక్క సాంగ్ పెట్టిస్తే చాలు సినిమా హిట్ అని నమ్మేవారట. అంతలా సిల్క్ తన ఖ్యాతిని పెంచుకుంది. అప్పట్లో ఆమె అందానికి ఫిదా కానీ వారుండేవారు కాదట. డస్కీగా ఉన్నా కూడా నవ్వుతూ ఉండే ఆమె ముఖం ఎప్పుడు కళగా ఉండేదట. ఇక ఆమె మేకప్ గురించి అప్పట్లో పెద్ద చర్చలు కూడా జరిగాయట. ఆమె ఎలాంటి మేకప్ వేసుకునేది.. ? ఎలాంటి కాస్ట్యూమ్స్ వాడేది..? ఇలాంటి వాటి గురించి స్టార్ హీరోయిన్స్ పెద్ద పెద్ద చర్చలే చేసేవారట. ఈ విషయాన్ని వారో వీరో కాదు.. స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ అంతటి వాడే ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

బాలయ్య ఏది చెప్పినా బల్ల గుద్దినట్లు నిక్కచ్చిగా చెప్తాడు. గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలయ్య.. సిల్క్ స్మిత మేకప్ గురించి, కాస్ట్యూమ్స్ గురించి మాట్లాడాడు. " ఇండస్ట్రీలో మేకప్, కాస్ట్యూమ్స్ విషయంలో సిల్క్ స్మితను ఢీకొట్టే ఆడదే లేదు అంటూ చెప్పుకొచ్చారు. అందరికంటే డిఫరెంట్ గా ఆమె కనిపించేదట. ఆమె వాడే మేకప్ ప్రొడక్ట్స్ ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది హీరోయిన్లు ప్రయత్నించేవారట.

hero balakrishna intresting comments about actress silk smitha old video viral in social media

ఇకపోతే బాలయ్య చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలకృష్ణ హీరోగా నటించిన ఆదిత్య 369 లో సిల్క్ స్మిత ఒక కీలక పాత్రలో నటించింది. జాణవులే.. నెరజాణవులే సాంగ్ లో బాలయ్య, సిల్క్ తో రొమాన్స్ కూడా చేశాడు. అప్పట్లో ఈ సాంగ్ ఎంతటి సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే ఒక వ్యక్తిని గుడ్డిగా ప్రేమించి, ఆ వ్యక్తి మోసం చేస్తే తట్టుకోలేక సిల్క్ స్మిత తన ప్రాణాలను తానే తీసుకుంది. ఇప్పటికీ ఆమె ఈ లోకంలో లేకపోయినా ఆమె సాంగ్స్ ద్వారా, ఆమె చేసిన మంచి పనుల ద్వారా ఎప్పటికీ జీవించే ఉంటుంది అని అభిమానులు చెప్పుకొస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X