ఉప్పెన సినిమాను చూసిన బాలకృష్ణ.. ఫ్యామిలీతో కలిసి

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల మధ్య అప్పుడప్పుడు కొంత దూరం పెరిగే వాతావరణం సహజమే అయినా.. చాలా వరకు ఎదురు పడితే మాత్రం స్నేహంగా ఉంటారు. ఇక మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలి మద్య కూడా ఇటీవల కాలంలో సాన్నిహిత్యం మాత్రం అమితంగా పెరుగుతోంది. ఇక చాలా సందర్భాల్లో మిగతా హీరోల సినిమాలు చూసే టైమ్ దొరకడం లేదని చెప్పిన బాలయ్య మొదటి సారి అనుకుంటా ఎవరు ఊహించని విధంగా మెగా హీరో సినిమా చూశారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో అదే హాట్ టాపిక్ గా మారింది.

ఉప్పెన సినిమాను చూస్తున్న హీరోలు

ఉప్పెన సినిమాను చూస్తున్న హీరోలు

నేటితరం దర్శకుల ఆలోచన ఆడియెన్స్ ఊహాలకందని రేంజ్ లో ఉంటోంది. కమర్షియల్ ఫార్మాట్ లో కాకుండా ప్రేమ కథలను కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేస్తున్నారు. ఆ ఫార్మాట్ లో వచ్చినదే ఉప్పెన సినిమా. దర్శకుడు బుచ్చిబాబు న్యూ డైరెక్టర్ అయినప్పటికీ సెన్సిటివ్ స్టోరీని వెండితెరపై చాలా ఎమోషనల్ గా చూపించాడు. ఇప్పటికే చాలా మంది హీరోలు ఈ సినిమాను చూశారు.

మొదటి నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్

మొదటి నుంచే పాజిటివ్ వైబ్రేషన్స్

ఈ దర్శకుడు నెక్స్ట్ ఎలాంటి సినిమా చేస్తాడు అనేది హాట్ టాపిక్ గా మారుతున్న సమయంలో అనేక రకాల రూమర్స్ వైరల్ అవుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు ఉప్పెన సినిమాతో రిలీజ్ కంటే ముందే మంచి బజ్ క్రియేట్ చేశాడు. సినిమా సెట్స్ పైకి వచ్చినప్పటి నుంచి కూడా పాజిటివ్ వైబ్రేషన్స్ ను క్రియేట్ చేస్తూ వచ్చింది.

స్పెషల్ షోలు వేయించుకొని మరి

స్పెషల్ షోలు వేయించుకొని మరి


ముఖ్యంగా పాటలతోనే ఆడియెన్స్ ను అమితంగా ఆకట్టుకుంది. ఇక ఉప్పెన సినిమా ఈ నెల 12న విడుదలవ్వగా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుంది. ఇక టాలీవుడ్ లో యువ హీరోలు స్టార్ హీరోలు అని తేడా లేకుండా చాలా మంది అగ్ర తారలు సినిమాను స్పెషల్ షోలు వేయించుకొని మరి చూస్తున్నారు. ఇక బాలకృష్ణ కూడా నందమూరి సభ్యులతో కలిసి సినిమాను చూశారు.

బాలకృష్ణ ఎందుకు చూశారంటే..

బాలకృష్ణ ఎందుకు చూశారంటే..

బాలకృష్ణ ఈ సినిమాను చూడడానికి కారణం ఉంది. సినిమాను మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన విషయం తెలిసిందే. అయితే వాళ్ళు నెక్స్ట్ గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో ఒక సినిమా చేస్తున్నారు. మైత్రితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి సినిమాను చూపిస్తున్నారు. అందులో భాగంగానే బాలకృష్ణకు కూడా సినిమాను చూపించారు.

దర్శకుడితో ఫొటో..

దర్శకుడితో ఫొటో..

ఇక సినిమాను చూసిన అనంతరం బాలకృష్ణ దర్శకుడి ప్రతిభను అమితంగా మెచ్చుకోవడమే కాకుండా అతనితో ఫొటోకు స్టిల్ ఇచ్చారు. అలాగే సినిమాలో నటించిన ప్రతి ఒక్కరిపై పాజిటివ్ కామెంట్స్ చేశారని తెలుస్తోంది. ఏదేమైనా బాలకృష్ణ మెగా హీరో వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా స్పెషల్ షో వేసుకొని మరి చూడటం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.

బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా..

బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా..

ఇక బుచ్చిబాబు నెక్స్ట్ సినిమా స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ అని ఒక టాక్ అయితే వైరల్ అవుతోంది. 1980 టైమ్ పీరియడ్ లో జరిగే ఆ కథ విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ఉంటుందట. ప్రస్తుతం స్క్రిప్ట్ రెడీ చేసుకుంటున్న బుచ్చిబాబు త్వరలోనే ఒక స్టార్ట్ హీరోకు కథను వినిపిస్తాడాని తెలుస్తోంది. ఇక జూనియర్ ఎన్టీఆర్ అతనికి రెగ్యులర్ గా టచ్ లో ఉండే హీరో. దీంతో భవిష్యత్తులో ఎన్టీఆర్ తో సినిమా తప్పకుండా ఉంటుందని చెప్పవచ్చు. మరి బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాక్ ఎవరితో ఉంటుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X