హీరోయిన్లు అంతా అయిపోయారు.. ఎవరనేది సస్పెన్స్, సాక్ష్యం తర్వాత 4రోజులు!

యంగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ నుంచి వస్తున్న మరో చిత్రం కవచం. శ్రీనివాస్ మామిళ్ళ ఈ చిత్రానికి దర్శకుడు. డిసెంబర్ 7న కవచం విడుదుల కానుండడంతో శ్రీనివాస్ బిజీగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడు. కమర్షియల్ ఎంటర్ టైనర్ గా ఈ చిత్రాన్ని దర్శకుడు తెరకెక్కించారు. తొలిసారి బెల్లంకొండ శ్రీనివాస్ ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండం విశేషం. ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా అల్లుడు శీను చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ సరైన కమర్షియల్ విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. కవచం చిత్రం మంచి విజయం సాధిస్తుందని శ్రీనివాస్ ధీమా వ్యక్తం చేస్తున్నాడు.

యాక్షన్ చిత్రాలంటే ఇష్టం

యాక్షన్ చిత్రాలంటే ఇష్టం

తనకు ప్రేమ కథల కన్నా యాక్షన్ చిత్రాలంటే ఇస్తామని శ్రీనివాస్ తెలిపాడు. యాక్షన్ చిత్రాల్లో నటించేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. వివిధరకాల వేరియషన్స్ లో నటించవచ్చు. ఎన్ని యాక్షన్ చిత్రాలు వచ్చినా మరో చిత్రంలో ఇంకా కొత్తగా ప్రయత్నించవచ్చు.. ఆ వెసులుబాటు యాక్షన్ చిత్రాలకు మాత్రమే ఉంటుందని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపాడు.

సినిమా కథ ఇదే

సినిమా కథ ఇదే

కవచం చిత్రంలోని కీలక విషయాన్ని బెల్లంకొండ శ్రీనివాస్ రివీల్ చేశాడు. ఊహించని కేసులో హీరోని కొందరు ట్రాప్ చేస్తారు. కేవలం ఒకే ఒక రోజులు ఆ కేసుని హీరో ఎలా చేధించాడు అనేది ఈ చిత్రంలోని కీలక పాయింట్ అని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. ఇంటర్వెల్ నుంచి స్క్రీన్ ప్లే చాలా వేగంగా ఉంటుంది. ట్విస్ట్ లని ఆడియన్స్ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు అని తెలిపాడు. ఈ చిత్రంలో తాను ఏ హీరోయిన్ కి కవచంగా ఉంటాననేది సస్పెన్స్. అది సినిమా చూసి మాత్రమే తెలుసుకోవాలి అని శ్రీనివాస్ తెలిపాడు.

అందరికి ఈ అవకాశం రాదు

అందరికి ఈ అవకాశం రాదు

తాను ఈ చిత్రంలో పోలీసు అధికారిగా నటించడంపై అంతా ఆశ్చర్యపోతున్నారు. నాకు పరిచయం ఉన్న చాలా మంది హీరోలు ఫోన్ చేసి అడుగుతున్నారు. చాలా త్వరగా పోలీస్ అధికారిగా నటిస్తునావు బ్రదర్. ఈ అవకాశం అందరికి రాదు అని అన్నారు. తన పాత్ర పోలీసులు అధికారి అయినప్పటికీ చాలా ఎంటర్ టైనింగ్ గా ఉంటుందని శ్రీనివాస్ తెలిపాడు. అల్లుడు శీను తరువాత అంతగా ఎంటర్ టైం మెంట్ ఉండే పాత్రలో నటించానని శ్రీనివాస్ తెలిపాడు.

సాక్ష్యం తర్వాత 4 రోజులు

సాక్ష్యం తర్వాత 4 రోజులు

ఈ చిత్రాన్ని చాలా లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కించాం. ఈ చిత్రం 10 కోట్ల బిజినెస్ చేసినా హిట్టే అని బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపాడు. సాక్ష్యం చిత్రపై తాను చాలా అసలు పెట్టుకున్నానని, ఆ సినిమా కోసం ఎంతో కష్టపడ్డానని కూడా బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపాడు. ఆ చిత్రం నిరాశపరచడంతో నాలుగు రోజులపాటు ఇంట్లో నుంచి బయటకు రాలేకపోయా అని శ్రీనివాస్ తెలిపాడు. వెంటనే కవచం చిత్రంతో బిజీ అయిపోయానని తెలిపాడు.

హీరోయిన్లు అంతా అయిపోయారు

హీరోయిన్లు అంతా అయిపోయారు

తాను వరుసగా స్టార్ హీరోయిన్లతో నటించడంపై శ్రీనివాస్ స్పందించాడు. అందరు హీరోయిన్లు అయిపోయారు. నెక్స్ట్ మూవీలో కొత్త హీరోయిన్ తో నటించమంటారా.. లేక హాలీవుడ్ నుంచి దించమంటారా అంటూ మీడియాతో సరదాగా వ్యాఖ్యానించాడు. సమంత, తమన్నా, పూజ హెగ్డే, కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ లాంటి స్టార్ హీరోయిన్లందరితో శ్రీనివాస్ ఆడి పాడాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X