Don't Miss!
- Sports
MI vs SRH: ప్చ్.. గెలిచే మ్యాచ్‌లో మళ్లీ ఓడిన హైదరాబాద్!
- News
కోవిడ్ ఆస్పత్రిలో మంటలు.. వార్డులకు వ్యాపించిన వైనం,, ఐదుగురు మృతి..
- Finance
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్, జూలై 1 నుండి పూర్తి డీఏ
- Lifestyle
కరోనా పెరగడానికి ఈ 4 విషయాలు ప్రధాన కారణం ... జాగ్రత్తగా ఉండండి ...
- Automobiles
భారత్‌లో ఫేమ్ స్కీమ్స్ కింద స్థాపించబడిన EV ఛార్జింగ్ స్టేషన్లు
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
హీరో గోపీచంద్ మెసేజ్ ఇవ్వబోతున్నాడు,ఎందుకో తెలుసా?
శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కె.కె.,రాధామోహన్ నిర్మిస్తోన్న చిత్రం పంతం. ఫర్ ఎ కాస్ ఉప శీర్షిక. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాలో మేహరిన్ హీరోయిన్ గా నటిస్తోంది. బలుపు, పవర్, జై లవకుశ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాలకు స్క్రీన్‌ప్లే అందించిన కె.చక్రవర్తి ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నారు.
గోపీచంద్ నటిస్తోన్న 25వ సినిమా కావడంతో ఈ మూవీని ప్రతిస్టాత్మకంగా నిర్మిస్తున్నారు. జూలై 5న సినిమాను రిలీజ్ చెయ్యడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా సందేశం తో పాటు కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రంగా తెరకెక్కిస్తున్నారు దర్శకుడు చక్రవర్తి. దీన్ని బట్టి చుస్తే గోపీచంద్ జనాలకు ఒక మెసేజ్ ఎవ్వబోతున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో ఈ సినిమాకు సంభందించిన క్లైమాక్స్ చిత్రీకరణ జరుగుతోందని సమాచారం. క్లైమాక్స్ పార్ట్ పూర్తయిన తర్వాత యు.కెలో కొన్ని కీలకమైన సన్నివేశాలు, పాటలను చిత్రీకరించబోతున్నారు. చిత్ర షూటింగ్ ఒకవైపు జరుగుతూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటోంది ఈ సినిమా.