twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    స్టార్ హీరోలకు రోగ మొస్తే...ప్లస్సా? మైనస్సా?

    By Bojja Kumar
    |

    ఈ మధ్య స్టార్ హీరోలు షూటింగ్ సమయంలోనో...సినిమా విడుదలకు ముందో రోగాల భారిన పడుతున్నారు. దీంతో సినిమా నిర్మాతల జేబులకు పెద్ద చిల్లులు పడక తప్పడం లేదు. అయితే అభిమానులు మాత్రం ఇలా తమ హీరోలు గాయాల పాలవ్వడం మంచికే అంటూ వాదిస్తున్నారు. గతంలో జరిగిన కొన్ని సంఘటలను ఉదాహరణగా చూపిస్తున్నారు.

    గతంలో బిగ్ అమితాబ్ 'కూలీ" సినిమా షూటింగ్ జరుగుతుండగా గాయ పడ్డారు. సినిమాలో ఫైటింగ్ సీన్లు చిత్రీకరిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో కొన్ని నెలల పాటు షూటింగ్ కు దూరం అయ్యారు బిగ్ బి. దీంతో నిర్మాతకు అనుకున్నదానికంటే ఖర్చు పెరిగింది. అయితే సినిమా విడుదలైన తర్వాత 'కూలీ" సినిమా బెగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.

    ఇటీవల సల్మాన్ హీరోగా రూపొందిన బాడీగార్డు సినిమా విడుదలకు రెండు రోజుల ముందు హీరో సల్మాన్‌కు మాయ రోగం వచ్చింది. దవడ కండరాలకు సంబంధించి త్రీవమైన నొప్పి రావడంతో అమెరికా వెళ్లి సర్జరీ చేయించుకున్నారు. డాక్టర్లు మరికొంత కాలం విశ్రాంతి అవసరం అని చెప్పడంతో ఆయనతో కోట్లు ఖర్చు పెట్టి సినిమాలు తీయడానికి ఏర్పాటు చేసుకున్న నిర్మాతలు కంగుతిన్నారు. సల్మాన్‌కు ఈ రోగం వచ్చుడేమో గానీ సెంటిమెంట్ వర్కౌట్ అయింది. 'బాడీగార్డు" సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకెలుతోంది.

    సూపర్ స్టార్ రజనీ హీరోగా దాదాపు 100 కోట్ల బడ్జెట్ తో 'రాణా" సినిమాకు ప్లాన్ చేశారు. అయితే షూటింగ్ ప్రారంభం రోజు ఆసుప్రతి పాలయ్యారు రజినీ. దీంతో షూటింగ్ అర్థాంతరంగా ఆగి పోయింది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభం అవుతుందనే దానిపై క్లారీటీ కూడా లేదు. దీంతో డిసెంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన సినిమా వచ్చే సంవత్సరానికి వాయిదా పడింది. అయితే ఇలా జరుగడం మంచి‌కే అనే వాదన వినిపిస్తోంది. గతంలో కొన్ని సినిమాల విషయంలో జరిగినట్లు...రజినీ అనారోగ్యం కారణంగా రాణా సినిమా బంపర్ హీట్ అవడం ఖాయం అంటున్నారు. అయితే ఈ ఫార్ములా అన్ని సమయాల్లోనూ వర్తిస్తుందనుకోవడం సబబు కాదంటున్నారు మరికొందరు.

    English summary
    There is a sentiment that if hero injures during shooting, the movie will do well at box office. Fans are expecting the same will repeat in Rajini's Rana movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X