twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బాద్‌షా' లో ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్స్

    By Srikanya
    |

    హైదరాబాద్ : మన సినిమాలో హీరో ఇంట్రడక్షన్ సీన్స్ అంటే ఓ రేంజిలో దుమ్ము రేపే ఫైట్ సీన్ ఉండాల్సిందే. హీరో వస్తూ వస్తూ విలన్స్ ను చితగ్గొట్టే... కార్యక్రమంలో దిగిపోతే అభిమానులకూ ఆనందం. ప్రస్తుతం ఎన్టీఆర్ తాజా చిత్రం 'బాద్‌షా' కోసం అలాంటి ఘట్టాన్నే తెరకెక్కిస్తున్నారు. కాజల్‌ హీరోయిన్ గా చేస్తున్న ఈ చిత్రానికి శ్రీనువైట్ల దర్శకత్వం వహిస్తున్నారు. బండ్ల గణేష్‌ నిర్మాత. ప్రస్తుతం హైదరాబాద్‌లో విజయన్‌ ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌పై ఫైట్ తెరకెక్కిస్తున్నారు. ఇందుకోసం ఓ భారీ సెట్‌ని నిర్మించారు.

    ఈ విషయమై నిర్మాత మాట్లాడుతూ... '' హీరో పరిచయ సన్నివేశంలో భాగంగా వచ్చే.. యాక్షన్‌ ఘట్టమిది. అభిమానులకు కనుల విందుగా ఉంటుంది. ఎన్టీఆర్‌ సంభాషణలు, వేషధారణ ఈ సినిమాలో సరికొత్తగా ఉంటాయి. వినోదం, యాక్షన్‌ మేళవించిన ఈ కథను శ్రీను వైట్ల తీర్చిదిద్దిన విధానం ఆకట్టుకొంటుంది''అని అన్నారు. జనవరిలో సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

    రీసెంట్ గా బండ్ల గణేష్ తన ట్విట్టర్ లో ఈ చిత్రం విడుదల తేదీ పై క్లారిటీ ఇచ్చారు. ఆ ట్వీట్ లో... " శ్రీను వైట్ల చిత్రం బాద్షా చిత్రం మార్చి 26 న భారీగా విడుదల అవుతుంది. ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ ఇది. ఈ చిత్రం అవుట్ పుట్ విషయమై నేను చాలా ఆనందంగా ఉన్నాను. " అని పోస్ట్ చేసారు.

    'బాద్‌షా డిసైడైతే వార్‌ వన్‌సైడ్‌ అయిపోద్ది' వంటి పవర్ ఫుల్ పంచ్ డైలాగులతో ఎన్టీఆర్ 'బాద్‌షా' ముస్తాబవుతున్న సంగతి తెలిసిందే. శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో కీలకమైన సీన్స్ ని తెరకెక్కిస్తున్నారు. సినిమాలో ఈ ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుందంటున్నారు. నిర్మాత బండ్ల గణేష్ మాట్లాడుతూ...''ఎన్టీఆర్‌ శైలికి తగిన కథ ఇది. యాక్షన్‌ పాళ్లు ఎక్కువగా ఉంటాయి. ఎన్టీఆర్‌ పాత్రని తెరపై ఆవిష్కరించే విధానం కొత్తగా ఉంటుంది. అనే సంభాషణలు అభిమానుల్ని ఆకట్టుకొంటాయి. '' అన్నారు.

    ''ఎన్టీఆర్ ఇమేజ్‌కి తగ్గట్టుగా ఉంటూనే నా స్టైల్‌లో పూర్తి వినోదభరితంగా సినిమా ఉంటుంది. ఇందులో ఎన్టీఆర్ పాత్ర చిత్రణ, ఆయన లుక్ కొత్తగా ఉంటుంది. నందమూరి అభిమానులు పండుగ చేసుకునే సినిమా అవుతుంది'' అని శ్రీనువైట్ల చెప్పారు. తమన్, గోపీమోహన్, కోన వెంకట్, ఎ.ఎస్.ప్రకాష్, ఎం.ఆర్.వర్మ, చలసాని రామారావు తెరవెనుక ప్రముఖంగా పనిచేస్తున్న ఈ చిత్రానికి సమర్పణ: శివబాబు బండ్ల.

    English summary
    Director Sreenu Vaitla is currently filming Hero Introduction action sequences on NTR for Baadshah. Kajal Agarwal is playing NTR's love interest for the second time in this film after Brindavanam (2010). SS Thaman is composing the music while Kona Venkat and Gopi Mohan are providing the script. BAADSHAH will be on screens on 28 march.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X