twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఇక్కడ మాత్రం హీరో జీరో.... డైరెక్టర్ హీరో!

    By Bojja Kumar
    |

    తమిళ హీరో విజయ్. తమిళనాట టాప్ హీరోల్లో ఒకరు. విజయ్ నటించిన తమిళ సినిమా 'నన్ బన్' తెలుగులో 'స్నేహితుడు' పేరుతో విడుదల కాబోతోంది. ప్రముఖ దర్శకుడు శంకర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హిందీలో బంపర్ హిట్టయిన 3ఇడియట్స్ సినిమాకు ఇది రీమేక్.

    తెలుగు సినిమా ట్రేడ్ వర్గాలు మాత్రం ఈ సినిమాకు సంబంధించి హీరో విజయ్ ని జోరోగా...డైరెక్టర్ శంకర్ ను హీరోగా చూస్తున్నారు. విజయ్ తమిళనాట పెద్ద స్టారే కావొచ్చు, కానీ తెలుగునాట అతనికి ఫేస్ వ్యాల్యూ లేదు. కేవలం శంకర్ కు ఉన్న వ్యాల్యూని బేస్ చేసుకుని నిర్మాత దిల్ రాజు ఈ సినిమా తెలుగు హక్కులను కోట్లు ఖర్చు పెట్టి సొంతం చేసుకున్నారు. శంకర్ గతంలో అపరిచితుడు, రోబో, భారతీయుడు, జెంటిల్మేన్ లాంటి భారీ చిత్రాలకు దర్శకత్వం వహించారు.

    తమిళ హీరోలైన విక్రమ్, సూర్య, జీవా తదితరులు తెలుగునాట మంచి మార్కెట్ ఏర్పరుచుకున్నారు. ఈ సినిమా హిట్టయితే తెలుగులోనూ తన సినిమా మార్కెట్ పెరుగుతుందని విజయ్ చాలా ఆశగా ఉన్నాడు. మరి జీరోగా ఉన్న విజయ్ హీరోగా అవుతాడో? లేదో? వెయిట్ అండ్ సీ...

    English summary
    Trade sources say hero Vijay will be of no use when calculations are made from Telugu market perspective. Alone the name of Shankar, who has got extra ordinary track record of delivering huge blockbusters, will be the central figure in selling of snehithudu. In this case, Hero is Zero and Director is Hero…isnt it?
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X