జగపతి బాబు "పటేల్ సార్ (S.I.R)...! టీజర్ చూస్తే పిచ్చెక్కిపోద్ది (వీడియో)

మరోసారి టైటిల్‌ పాత్రధారిగా ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు జగపతి. ఆ సినిమా పేరు ‘పటేల్‌’. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘యస్‌.ఐ.ఆర్‌’ అనేది ట్యాగ్‌ లైన్.

జగపతిబాబు హీరోగా మరోసారి తన మార్క్ చూపించేందుకు రెడీ అవుతున్నారు. టైటిల్ పాత్రలో నటిస్తున్న తాజా సినిమా పటేల్. S.I.R అనే ట్యాగ్ లైన్ తో వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ ద్వారా ప్రముఖ యాడ్ ఫిలిమ్ మేకర్ వాసు పరిమి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. ...

 కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా

కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గా

క్రూరమైన విలన్ గానూ గొప్పగా రాణించి, మెప్పించారు. ఇంకోవైపు కేరక్టర్‌ ఆర్టిస్ట్‌గానూ కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి టైటిల్‌ పాత్రధారిగా ఓ సినిమా చేసేందుకు అంగీకరించారు జగపతి. ఆ సినిమా పేరు ‘పటేల్‌'. వారాహి చలనచిత్రం పతాకంపై సాయి కొర్రపాటి సమర్పిస్తున్న ఈ చిత్రానికి ‘యస్‌.ఐ.ఆర్‌' అనేది ట్యాగ్‌ లైన్.

వాసు పరిమి

వాసు పరిమి

వాసు పరిమి దర్శకునిగా పరిచయమవుతున్నారు. ఈ ‘ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌' షూటింగ్‌ రెండు రోజుల క్రితమే మొదలైంది. ఎం.ఎం. కీరవాణి క్లాప్‌నివ్వగా, కల్యాణ్‌ కోడూరి కెమెరా స్విచ్చాన్ చేసిన ముహూర్తపు సన్నివేశానికి యస్‌.యస్‌. రాజమౌళి గౌరవ దర్శకత్వం వహించారు.

టీజర్‌ విడుదల

టీజర్‌ విడుదల

అదే రోజు సినిమా ఎలా ఉండబోతోందో చూచాయగా తెలపడానికి ఒక టీజర్‌ను విడుదల చేశారు. షూటింగ్‌కు వెళ్లే ముందు కేవలం రెండు రోజుల్లో దీనిని తయారు చేశారు. ఇందులో ఇప్పటివరకూ కనిపించని కొత్త రూపంలో కనిపిస్తున్నారు జగపతిబాబు. తెల్లటి జుట్టు, గడ్డంతో ‘ఇంటెన్స్ లుక్‌'తో ఆకట్టుకుంటున్నారు.

సెకండ్ ఇన్నింగ్స్‌

సెకండ్ ఇన్నింగ్స్‌

జగపతిబాబు తన సెకండ్ ఇన్నింగ్స్‌లో వీర విహారం చేస్తున్నాడు.లెజెండ్ లో విలన్ గా , శ్రీమంతుడు సినిమాలో మహేశ్ బాబు తండ్రి పాత్రలో మెరిసిన జగపతి.. దానికి ముందు, తర్వాత కూడా సీనియర్ పాత్రలతో మంచి హిట్లు కొడుతున్నారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రధారిగా రూపొందుతున్న 'పటేల్ సర్' సినిమా టీజర్ విడుదలైంది.

గ్యాంగ్‌స్టర్‌లా

గ్యాంగ్‌స్టర్‌లా

ఒంటి నిండా టాటూలు, తెల్లజుట్టు, గడ్డంతో స్టైలిష్, రఫ్‌ లుక్‌తో జగ్గూభాయ్ ఇరగదీసేశాడనే చెప్పాలి. బుల్లెట్‌పై స్టైలిష్‌గా వస్తూ ఏజ్ బారైన గ్యాంగ్‌స్టర్‌లా మెప్పించబోతున్నాడు. ఇక, జగపతిబాబుతో చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లరట ఇది. ఆ విషయం సినిమా టీజర్‌తో రుజువైంది.

 ట్రెండీగా జగపతిబాబు

ట్రెండీగా జగపతిబాబు

వాస్తవానికి ఈ సినిమాను కన్నడ నిర్మాత కుమారస్వామి నిర్మిస్తాడని గతంలో జగపతి బాబు చెప్పినా.. సాయి కొర్రపాటి నిర్మిస్తున్నాడిప్పుడు. మరి, జగపతి బాబును ఈ రేంజ్ స్టైల్‌గా, ట్రెండీగా జగపతిబాబులోని మరో కోణాన్ని ఆవిష్కరించబోతున్న ఆ కొత్త డైరెక్టర్ వాసు పరిమి. టీజర్‌తో అటు డైరెక్టర్, ఇటు జగపతి బాబు అలరించారు. మరి, సినిమాలో వారి పెర్ఫార్మెన్స్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలంటే మరి కొన్ని నెలలు ఆగాల్సిందే.

ఎస్ఎస్ రాజమౌళి ఫిదా

ఎస్ఎస్ రాజమౌళి ఫిదా

అందులో జగపతి బాబు లుక్ చూసి దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి ఫిదా అయిపోయారు. జగపతి బాబు చాలా అద్భుతంగా కనిపిస్తున్నారని ట్వీట్ చేశారు. వారాహి సంస్థ మరో మంచి సినిమాను తీసుకొస్తోందని చెబుతూ.. పటేల్ సినిమాకు ఆల్ ద బెస్ట్ చెప్పారు. పటేల్ సర్ టీజర్‌కు 24 గంటల్లోనే ఏడున్నర లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

యాంగ్రీ మ్యాన్‌గా

ఈ సినిమాలో మరోసారి వయసు మళ్లినా కూడా యాంగ్రీ మ్యాన్‌గా జగపతిబాబు కనిపిస్తున్నారు. ఈ చిత్రానికి రచన: సునీల్‌, సంగీతం: డీజే వసంత్, ఛాయాగ్రహణం: శ్యామ్‌ కె. నాయుడు, లైన్ ప్రొడ్యూసర్‌: కార్తికేయ, సమర్పణ: సాయిశివాని, నిర్మాత: రజని కొర్రపాటి

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X