Karthi Japan: కార్తీ జపాన్ మూవీ హిట్ అవ్వాలంటే.. ఎంత వసూలు చేయాలో తెలుసా?
కోలీవుడ్ లోనే కాదు.. టాలీవుడ్ లోనూ అంతే క్రేజ్ ఉన్న హీరో కార్తి. సూర్య తమ్ముడిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టినప్పటికీ.. తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఈ హీరో తాజాగా నటించిన చిత్రం జపాన్. ఈ సినిమా నవంబర్ 10న అంటే ఈరోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక పాజిటివ్ టాక్ తో దూసుకుపోతుంది. ఇదిలా ఉంటే ఈ సినిమా హిట్ కొట్టాలంటే.. బాక్సాఫీస్ వద్ద ఎంత వసూలు చేయాలో తెలుసుకుందాం.
తమిళ హీరో అయినప్పటికీ.. తెలుగులో మంచి క్రేజ్ ఉన్న హీరోల్లో కార్తి ఒకడు. ఆవారా చిత్రంతో అందరినీ ఆకర్షించిన ఈ హీరో.. ఇక అప్పటి నుంచి తను చేసి ప్రతి సినిమాను తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నాడు. ఇక ఇక్కడ స్టార్ హీరో రేంజ్ గుర్తిం అయితే ఆయనకు ఉంది. ఇక ఆ మధ్య వచ్చిన ఖైదీ సినిమా ఎంత సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా.. త్వరలోనే ఖైదీ 2 కూడా రూపొందించనున్నారు.

ఇక విక్రమ్, లియో సినిమాకు ఖైదీ సినిమా కనెక్షన్ ఉండటంతో... నెక్ట్స్ ఖైదీ 2 సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే కార్తీ తాజాగా నటించిన చిత్రం జపాన్. ఈ సినిమా తెలుగు, తమిళ్ భాషల్లో తెరకెక్కింది. ఇక ఈ సినిమాకు మురుగన్ దర్శకత్వం వహించగా.. అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్ గా నటించింది. ఇక కార్తీ కెరీర్ లో 25వ సినిమాగా జపాన్ తెరకెక్కింది. ఇక ఈ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఇక జపాన్ సినిమా పాజిటివ్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ట్రైలర్స్, కార్తీకి ఉన్న క్రేజ్ వల్ల.. ఈ సినిమా మంచి బిజినెస్ చేసుకుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయింది. ఇక తెలంగాణ, ఆంధ్ర కలిపి ఈ సినిమా రూ.6 కోట్ల బిజినెస్ నమోదు చేసుకున్నట్లు సమాచారం. ఇక తెలుగులో ఈ సినిమా హిట్ కొట్టాలంటే... రూ.6.50 కోట్ల షేర్ వసూలు చేయాలి.

జపాన్ సినిమా ప్రపంచవ్యాప్తంగా మంచి బిజినెస్ నమోదు చేసుకుంది. ఈ సినిమాకు మంచి బజ్ రావడంతో.. వరల్డ్ వైడ్ గా రూ.40కోట్ల బిజినెస్ జరుపుకుంది. దీంతో ఈ సినిమా రూ.41కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ బాక్సాఫీస్ బరిలోకి వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్టుగా నిలవాలంటే... బాక్సాఫీస్ వద్ద రూ.41 కోట్ల షేర్ లేదా.. 80 కోట్ల గ్రాస్ రాబట్టాలి. అలా అయితే ఈ సినిమా క్లీన్ హిట్ స్టెటస్ తెచ్చుకుంటుంది.
ఇక జపాన్ సినిమా ఓవరాల్ గా మంచి బిజినెస్ నమోదు చేసుకుంది. ఈ సినిమాకు ఏ మాత్రం మంచి టాక్ వచ్చినా.. ఈ కలెక్షన్స్ సాధించడం లేక్కేమి కాదు. లాస్ట్ ఇయర్ సర్దార్ తో భారీ హిట్ ను అందుకున్న కార్తీ... ఈ సినిమాతో ఆ విజయాన్ని మించిన విజయాన్ని సొంతం చేసుకుంటాడని ఫ్యాన్స్ అంటున్నారు. చూడాలి మరి ఏం జరగనుందో.


Click it and Unblock the Notifications











