twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హీరో కారు వెనక ప్యాన్స్ ఫాలో...ఇబ్బంది

    By Srikanya
    |

    చెన్నై : స్టార్స్ కు తమ ఫ్యాన్స్ అభిమానం ఎంత ఆనందం కలిగిస్తుందో ఒక్కోసారి అంతే ఇబ్బంది కూడా కలిగిస్తుంది. అలాంటి అనుభవం తనకు ఎదురైందని చెబుతున్నాడు కార్తీ. 'ఓసారి కొంతమంది కుర్రాళ్లు నన్ను చూడ్డానికి వచ్చారట. ఆ తరువాత నేను ఇంటి నుంచీ షూటింగ్‌కి బయలుదేరాను. నా కారుని ఫాలో చేయడం మొదలుపెట్టారు. నా కారు ఎంత వేగంగా వెళ్తుంటే వాళ్లూ అంతే వేగంతో వస్తున్నారు. చివరికి ఇదో రేస్‌లా మారిపోయింది. పరిస్థితి బాలేదని కారు ఆపేసి దిగాను. వాళ్లు నా దగ్గరకి వచ్చి నాతో ఫొటో దిగాలని ఉందనీ అందుకే ఫాలో అవుతున్నామనీ చెప్పారు. ఫొటో దిగి వాళ్లను పంపేశా' అన్నాడు కార్తి.

    ఈ తమిళ హీరో 'ఆవారా', 'నా పేరు శివ', 'యుగానికి ఒక్కడు' లాంటి చిత్రాలతో తెలుగులో కూడా అభిమానుల్ని సంపాదించుకున్నారు. తాజాగా ఈయన నటించిన 'బ్యాడ్‌బాయ్‌' చిత్రం ఈ నెల 22న విడుదల కాబోతుంది. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. ''కథను బట్టి హీరో పాత్ర ఉండాలి కానీ కథానాయకుడికి తగ్గట్టు కథ ఉండదు. ఒకవేళ ఉన్నా అది అంతగా ప్రేక్షకుల్ని ఆకట్టుకోదు. కథలోని ఆ పాత్రలో నేను ఎంతవరకూ సరిపోతానో చూసుకుంటానంతే. ఒక వేళ నేను చేయగలిగితే అందుకోసం ఎంత కష్టమైనాపడతాను'' అంటున్నారు కార్తి.

    ఇక ''శకుని తరవాత విరామం వచ్చిన మాట వాస్తవమే. సరైన సినిమాలు కుదరక ఆలస్యం అయింది. స్వతహాగా ఇంత విరామం నాకు ఇష్టం లేదు. అందుకే ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాను. తెలుగు ప్రేక్షకులు నన్ను చక్కగా ఆదరిస్తున్నారు. శకుని తర్వాత నా సినిమా రావడం ఆలస్యం అయినా 'బ్యాడ్‌బాయ్‌' ఆ లోటుని తీరుస్తుంది.'' అన్నారు.

    చిత్రం గురించి చెప్తూ...''నిజ జీవితంలో కూడా మంచి చెడూ రెండూ ఉంటాయి. మంచి అబ్బాయి పాత్రలు తరచూ చేస్తుంటాం. చెడ్డ అబ్బాయిగా కూడా నటించడంలోనే కిక్‌ ఉంటుంది. ఇలాంటి పాత్రల్లోనే నటనకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. అందుకే బ్యాడ్‌బాయ్‌ చిత్రాన్ని అంగీకరించాను. డబ్బు సంపాదించడమే లోకంగా బతికే యువకుడి కథ ఇది. అనుకోకుండా ఓ యువతి అతని జీవితంలో ప్రవేశిస్తుంది. ఆమె ప్రభావంతో అతను మంచివాడిగా మారాడో లేదో అనేది తెరపైనే చూడాలి. అటు మాస్‌నీ, ఇటు యువతనీ ఆకట్టుకొనే అంశాలున్నాయి. దేవిశ్రీప్రసాద్‌ అందించిన సంగీతం చిత్రానికి ప్రధాన బలం. పరిగెట్టే రైలుపై చేసిన పోరాట సన్నివేశం మరచిపోలేనిది. ఆ సన్నివేశానికి ముందు చాలా కసరత్తు చేశాను.'' అన్నారు.

    ఆంధ్రప్రదేశ్‌ అంతటా స్టూడియో గ్రీన్‌ బ్యానర్‌పై నిర్మాత కె.ఇ.జ్ఞానవేల్‌ రాజాగా రిలీజ్‌ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, ఫొటోగ్రఫీ: ఎస్‌.శరవణన్‌, మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, కో-ప్రొడ్యూసర్స్‌: ఎస్‌.ఆర్‌. ప్రకాష్‌బాబు, ఎన్‌.ఆర్‌.ప్రభు, నిర్మాత: కె.ఇ.జ్ఞానవేల్‌ రాజా, దర్శకత్వం: సురాజ్‌.

    English summary
    
 Tamil Movie Alex Pandian releasing as 'Bad Boy' on this month 22nd . Directed by Suraj. Starring Karthi, Anushka Shetty and Santhanam in Lead Roles. The film has music by Devi Sri Prasad.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X