Don't Miss!
- News రిజర్వేషన్లు రద్దు చేస్తారు: మోడీ, కేసీఆర్‌పై రేవంత్ సంచలన ఆరోపణలు
- Sports SRH vs RCB: కొంపముంచిన విరాట్ కోహ్లీ జిడ్డు బ్యాటింగ్!
- Technology OnePlus Watch 2 వన్‌ప్లస్ వాచ్ 2 కొత్త వేరియంట్ విడుదల.. ధర, సేల్ పూర్తి వివరాలు..!
- Lifestyle పాలలో తామరవిత్తనాలు కలుపుకొని తాగితే ఇన్ని ప్రయోజనాలుంటాయా..?
- Finance Jio Cinema Premium: నెలకు 29లతో జియో ప్రీమియం..
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
'దేవ్' ట్విట్టర్ రివ్యూ: అడ్వెంచర్ హీరోగా కార్తీ, రకుల్‌తో రొమాన్స్.. ఫ్రెండ్షిప్ సీన్స్ అదుర్స్!
తమిళ హీరో కార్తీకి తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ఆవారా, నా పేరు సూర్య, ఊపిరి చిత్రాలతో కార్తీకి సౌత్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. ప్రస్తుతం కార్తీ తాజాగా నటించిన చిత్రం దేవ్. రాజత్ రవిశంకర్ ఈ చిత్రానికి దర్శకుడు. స్టైలిష్ లవ్ స్టోరీగా ఈ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కార్తీ సరసన ఈ చిత్రంలో స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ నటిస్తుండడం విశేషం. కార్తీ ఈ చిత్రంలో అడ్వెంచర్ హీరోగా కనిపిస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర ఈ చిత్రంలో విభిన్నంగా ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ గ్రాండ్ విజువల్స్ తో ఆకట్టుకుంది. నేడు ఈ చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం!
|
సాలిడ్ హిట్
దేవ్ చిత్రానికి ఇప్పుడే ఇంటర్వెల్ పడింది. ఇప్పటి వరకు చిత్రం చాలా బావుంది. హీరో కార్తీ, ఆర్ జె విగ్నేష్ నటనతో అదరగొట్టేశారు. దేవ్ చిత్రం సాలిడ్ హిట్.
|
ఫస్టాఫ్ బావుంది కానీ
దేవ్ చిత్ర ఫస్ట్ హాఫ్ బావుంది కానీ స్లోగా ఉంది. కథని సాగదీసినట్లుగా అనిపించింది.
|
గ్రాండ్ విజువల్స్
దేవ్ చిత్రంలో విజువల్స్ గ్రాండ్ గా ఉన్నాయి. రొమాన్స్, ఫ్రెండ్ షిప్ సన్నివేశాలు చాలా బావున్నాయి. విగ్నేష్, అమృత దేవ్ స్నేహితులుగా నటించారు. రకుల్ ప్రీత్ సింగ్ లుక్స్ చాలా బావున్నాయి.
|
రెండు కోణాల్లో
దేవ్ చిత్రం ప్రశాంతంగా చూసే విధంగా ఉంది. హీరో కార్తీ అటు స్నేహితుడిగా, ఇటు ప్రేమికుడిగా అద్భుతంగా నటిస్తునాడు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర కూడా బావుంది. క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా ఈ చిత్రంలో నటన పరంగా మంచి ప్రాధాన్యత దక్కింది. దేవ్ ఒక ఫీల్ గుడ్ మూవీ.
|
గొప్పగా ఏం లేదు
దేవ్ చిత్రం అంత గొప్పగా లేదు. సినిమా మొత్తం కథని వెతుక్కోవడానికి సరిపోయింది.
|
ఎంగేజింగ్‌గా ఉంది
దేవ్ చిత్రంలో కథ, స్క్రీన్ ప్లే అన్ని బ్యాలెన్స్ గా ఉన్నాయి. ఫ్రెండ్ షిప్, ప్రేమని చాలా బాగా చూపించారు. రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర అమేజింగ్ అనిపించేలా ఉంది. ఇక విగ్నేష్, అమృతతో కార్తీ నటించే సన్నివేశాలు ఎంగేజింగ్ గా ఉన్నాయి.