For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  బాహుబలి లో ప్రభాస్ చేసాడుగా... నాదేముందీ?? మరీ అంత సీరియస్ మూవీ కాదు.. కార్తి

  |

  తమిళనాడులో హీరో సూర్య తమ్ముడు కార్తీ హీరోగా ఎంట్రీనే చాలా విభిన్నమైన పాత్రతో ఇచ్చాడు. యుగానికి ఒక్కడు అనే చిత్రంలో చాలా మాస్ గా కనిపిస్తూ ఎంతో నేచురల్ గా చేశాడు..అప్పట్లో ఈ సినిమాలో నటించినందుకు మనోడికి మంచి పేరు వచ్చింది. తర్వాత ఆవారా, నా పేరు శివ వంటి చిత్రాలతో తెలుగులో తనకంటూ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. తెలుగులో ఈ ఇద్దరు అన్నాదమ్ములకు చాలా మంది అభిమానులు ఉన్నారడంలో అశ్చర్యం లేదు. ఇక నాగార్జునతో కలిసి నటించిన 'ఊపిరి' చిత్రంలో కార్తీకి చాలా చక్కటి పేరు వచ్చింది..

  ఇక ఆ తర్వాత ఈ తమిళ్ యంగ్ హీరో కథానాయకుడిగా పి.వి.పి. సినిమా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకాలపై గోకుల్‌ దర్శకత్వంలో పెరల్‌ వి. పొట్లూరి, పరమ్‌ వి. పొట్లూరి, కెవిన్‌ అన్నె, ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌ బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు నిర్మిస్తున్న భారీ చిత్రం 'కాష్మోరా'. ఈ సినిమా ట్రైలర్, ఆడియో విడుదల కార్యక్రమం అక్టోబర్ 7న జ‌రిగింది. పూర్తిగా గుండు దానిపై ఓ టాటూ..ఓ యుద్ధ నేపథ్యంలో నడిచే కథలో సైనికాధికారిలా కనిపిస్తూ కార్తీ చూస్తుంటే ఇదేదో చారిత్రాత్మక చిత్రంలా అనిపిస్తుంది.

  Hero Karthi speaks about his New Movie Kaashmora

  సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కార్తీ సరసన నయనతార, శ్రీ దివ్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీ పైడిప‌ల్లి తొలి పాట‌ను, రెండో పాట‌ను శ్రీదివ్య విడుద‌ల చేశారు. ట్రైల‌ర్‌ను, ఆడియో సీడీల‌ను మాధ‌వ‌న్ ఆవిష్క‌రించారు. ఈ సినిమా విషయం లో చాలా కష్తపడ్డారు కదా... ఎలా ఫీలయ్యారూ అని అడిగిన ప్రశ్నకు ఇలా జవాబిచ్చాడు కార్తీ

  కాష్మోరా సినిమా కోసం రెండేళ్ల కష్టపడటంపై తనకెలాంటి రిగ్రెట్స్ లేవన్నాడు కార్తి. ఈ విషయంలో తనకు ప్రభాసే స్ఫూర్తి అని చెప్పాడతను. ''కాష్మోరా లాంటి సినిమా కోసం అంత సమయం వెచ్చించక తప్పదు. రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం పని చేయడం నాకు సంతోషమే. నా సంగతెందుకు.. ప్రభాస్ బాహుబలి కోసం ఎన్నేళ్లు కష్టపడ్డాడో అందరికీ తెలిసిందే. దాని వల్ల అతడికి ఎంత పేరొచ్చింది.. ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు. మా సినిమా కూడా విడుదలయ్యాక సరైన ఫలితమే దక్కుతుంది. ప్రభాస్ అంత కష్టపడ్డాక నాకేమైంది" అని కార్తి అన్నాడు.

  Hero Karthi speaks about his New Movie Kaashmora

  ఈ సినిమా కోసం దర్శకుడు గోకుల్ ఏడాది పాటు రీసెర్చ్ చేశాడని.. సినిమాలో ప్రతి సన్నివేశం.. ప్రతి డైలాగ్ రిహార్సల్స్ చేశాకే షూట్ చేశామని.. ఈ సినిమా కోసం కష్టపడ్డట్లు మరే సినిమాకూ కష్టపడలేదని కార్తి తెలిపాడు. తమ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే 'బాహుబలి" విడుదలైందని.. ఆ సినిమా నుంచి తాము ఎంతో స్ఫూర్తి పొందామని.. సెట్టింగ్స్ దగ్గర్నుంచి అన్ని విషయాల్లోనూ ప్రమాణాలు పెంచుకున్నామని చెప్పాడు. అందరూ అనుకుంటున్నట్లు 'కాష్మోరా' సీరియస్ మూవీ కాదని.. చాలా ఎంటర్టైనింగ్గా సాగుతుందని.. ఇది ఒక ఫాంటసీ హార్రర్ థ్రిల్లర్ కామెడీ హిస్టారికల్ మూవీ అని కార్తి అభిప్రాయపడ్డాడు. సినిమా ఆద్యంతం వినోదాత్మకంగా ఉంటుందని కార్తి చెప్పాడు. ఈ నెల 29న 'కాష్మోరా' ప్రేక్షకుల ముందుకు రానుంది.

  English summary
  "Bahubali Prabas is our inspiration" Tamil Young hero Karthi speaks about Prabhas efforts in Bahubali at his New Movie Kaashmora audio release function
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X