twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విధవను లవ్ చేసి ఎదవను అయ్యాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్

    |

    తమ సినిమానుల ప్రమోట్ చేసుకునేందుకు చిత్ర సంస్థలు ఈ మధ్య ఎక్కువగా బుల్లితెర మీద ఫోకస్ పెడుతున్నాయి. ఈక్రమంలో చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్లు దర్శకులు బుల్లితెర షోల్లో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సుమ హోస్ట్‌గా చేస్తోన్న షోల్లోనే సెలెబ్రిటీలు హల్చల్ చేస్తుంటారు. తాజాగా చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమనిలు బుల్లితెరపై సందడి చేశారు.

     సుమ సందడి..

    సుమ సందడి..

    ప్రతీ వారం సినిమా హీరో హీరోయిన్లతో తన షోలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టార్ట్ మ్యూజిక్, క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో ప్రతీ వారం ఏదో సినిమాకు సంబంధించిన చిత్రయూనిట్ వస్తుంటుంది. అలా ఈ ఆదివారం స్టార్ట్ మ్యూజిక్ షోలో చావు కబురు చల్లగా టీం వచ్చింది.

     చావు కబురు చల్లగా..

    చావు కబురు చల్లగా..

    కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వచ్చిన చావు కబురు చల్లగా మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం సినిమా విఫలమైంది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఈ క్రమంలో సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు బుల్లితెరపై గురి పెట్టింది చిత్రయూనిట్.

     బుల్లితెరపై రచ్చ..

    బుల్లితెరపై రచ్చ..

    కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు బుల్లితెరపై రచ్చ చేసేందుకురెడీ అయ్యారు. అలీతో సరదాగా షోలో గెస్ట్‌లుగా రాబోతోన్నారు. అంతే కాకుండా వచ్చే ఆదివారం నాడు సుమతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్ అవుతున్నాయి.

    అందులో అలా..

    అందులో అలా..

    అలీతో సరదాగా షోలో చావు కబురు చల్లగా గురించి మాట్లాడుతూ.. కథ విని ఓకే చేశానని, అసలు హీరో గురించి పట్టించుకోలేదని లావణ్య చెప్పిందట. కనీసం హీరో మంచి వాడు అందుకే ఒప్పుకున్నానని చెప్పొచ్చు కదా అని లావణ్య గురించి కార్తికేయ కామెంట్ చేశాడు.

    విదవను లవ్ చేసి..

    విదవను లవ్ చేసి..

    కార్తికేయను ఉద్దేశిస్తూ.. వీడు పెద్ద వెదవ అని లావణ్య త్రిపాఠి పంచ్ వేసింది. వెంటనే కార్తికేయ రియాక్ట్ అవుతూ.. అవును విదవను లవ్ చేసి వెదవను అయ్యాను అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి సినిమాలోని కాన్సెప్ట్‌ను ఇలా అందరికీ చెప్పేశారు.

    English summary
    Hero Karthikeya Fun With Suma In Start music,
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X