Don't Miss!
- Finance Adani News: గౌతమ్ అదానీ తిరిగొచ్చిన మంచిరోజులు.. ఆ 5 కంపెనీల్లో సంచలనం..
- Technology OnePlus Flip వన్‌ప్లస్ ఫ్లిప్ ఫోన్ కీలక వివరాలు లీక్... టెలిఫోటో కెమెరా సహా కీలక ఫీచర్లు..!
- Travel ట్రైన్ జర్నీలో ఆరు రోజులపాటు సాగే తిరుపతి టు ఊటీ టూర్ ప్యాకేజీ..వివరాలివే..!
- News కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే: రేవంత్‌తో భేటీ: గ్రేటర్ హైదరాబాద్‌లో భారీ షాక్
- Lifestyle డిఫరెంట్ స్టైల్ లో నోనూరించే మటన్ రోస్ట్
- Automobiles 25 దేశాల్లో రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ రెంటల్స్ అండ్ టూర్స్ సర్వీస్.. RE ఫ్యాన్స్‌కు పండగే
- Sports వరుస పరాజయాల వేళ.. ఆర్సీబీ, కోహ్లీ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్
విధవను లవ్ చేసి ఎదవను అయ్యాను.. హీరో కార్తికేయ కామెంట్స్ వైరల్
తమ సినిమానుల ప్రమోట్ చేసుకునేందుకు చిత్ర సంస్థలు ఈ మధ్య ఎక్కువగా బుల్లితెర మీద ఫోకస్ పెడుతున్నాయి. ఈక్రమంలో చిత్రానికి సంబంధించిన హీరో, హీరోయిన్లు దర్శకులు బుల్లితెర షోల్లో సందడి చేస్తున్నారు. మరీ ముఖ్యంగా సుమ హోస్ట్‌గా చేస్తోన్న షోల్లోనే సెలెబ్రిటీలు హల్చల్ చేస్తుంటారు. తాజాగా చావు కబురు చల్లగా సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కార్తికేయ, లావణ్య త్రిపాఠి, ఆమనిలు బుల్లితెరపై సందడి చేశారు.
సుమ సందడి..
ప్రతీ వారం సినిమా హీరో హీరోయిన్లతో తన షోలో చేసే సందడి ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. స్టార్ట్ మ్యూజిక్, క్యాష్, బిగ్ సెలెబ్రిటీ చాలెంజ్ షోలో ప్రతీ వారం ఏదో సినిమాకు సంబంధించిన చిత్రయూనిట్ వస్తుంటుంది. అలా ఈ ఆదివారం స్టార్ట్ మ్యూజిక్ షోలో చావు కబురు చల్లగా టీం వచ్చింది.
చావు కబురు చల్లగా..
కార్తికేయ, లావణ్య త్రిపాఠి జంటగా వచ్చిన చావు కబురు చల్లగా మూవీ గత వారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే అంచనాలను అందుకోవడంలో మాత్రం సినిమా విఫలమైంది. అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రావడం లేదు. ఈ క్రమంలో సినిమాను మరింతగా ప్రమోట్ చేసుకునేందుకు బుల్లితెరపై గురి పెట్టింది చిత్రయూనిట్.
బుల్లితెరపై రచ్చ..
కార్తికేయ, లావణ్య త్రిపాఠిలు బుల్లితెరపై రచ్చ చేసేందుకురెడీ అయ్యారు. అలీతో సరదాగా షోలో గెస్ట్లుగా రాబోతోన్నారు. అంతే కాకుండా వచ్చే ఆదివారం నాడు సుమతో సందడి చేసేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ రెండు ప్రోమోలు వైరల్ అవుతున్నాయి.
అందులో అలా..
అలీతో సరదాగా షోలో చావు కబురు చల్లగా గురించి మాట్లాడుతూ.. కథ విని ఓకే చేశానని, అసలు హీరో గురించి పట్టించుకోలేదని లావణ్య చెప్పిందట. కనీసం హీరో మంచి వాడు అందుకే ఒప్పుకున్నానని చెప్పొచ్చు కదా అని లావణ్య గురించి కార్తికేయ కామెంట్ చేశాడు.
విదవను లవ్ చేసి..
కార్తికేయను ఉద్దేశిస్తూ.. వీడు పెద్ద వెదవ అని లావణ్య త్రిపాఠి పంచ్ వేసింది. వెంటనే కార్తికేయ రియాక్ట్ అవుతూ.. అవును విదవను లవ్ చేసి వెదవను అయ్యాను అంటూ కౌంటర్ వేశాడు. మొత్తానికి సినిమాలోని కాన్సెప్ట్‌ను ఇలా అందరికీ చెప్పేశారు.