హిప్పి ప్లాప్ తర్వాత కోలుకోలేకపోయా.. సందీప్‌కు ఎన్నో అప్ అండ్ డౌన్స్.. కార్తీకేయ

సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా శుక్రవారం (జూలై 12న) విడుదల కానుంది. బుధవారం రాత్రి హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఫంక్ష‌న్ నిర్వ‌హించారు. యువ హీరోలు నిఖిల్, సుధీర్ బాబు ముఖ్య అతిథులుగా, 'ఆర్ఎక్స్ 100' ఫేమ్ కార్తికేయ, 'ఫ‌ల‌క్‌నుమా దాస్‌' ఫేమ్ విశ్వక్ సేన్ అతిథులుగా హాజరయ్యారు.

RX 100 ఫేమ్ కార్తికేయ మాట్లాడుతూ "నా సినిమా ఫంక్ష‌న్స్‌కి, ఇత‌రుల ఫంక్ష‌న్స్‌కి ఎప్ప‌డూ వెళ్ల‌లేదు. నన్ను ఎవరూ గెస్ట్‌గా పిల‌వ‌లేదు. ఫస్ట్ టైమ్ సందీప్ అన్న పిలిచారు. నాకంటే సీనియర్ అయినా... నేను జిమ్‌లోనూ కానీ, బయట ఎక్కడైనా కనిపించినా సందీప్ అన్న చక్కగా మాట్లాడతారు. ఆయనను చూస్తే నాకు తెలియకుండా 'బిగ్ బ్రదర్' అనే ఫీలింగ్ వస్తుంది. సినిమాలపై ఆయనకున్న ప్రేమ నన్ను ఇన్‌స్ఫైర్ చేస్తుంది. డిఫరెంట్ సినిమాలు చేస్తూ ఉంటారు. ఇప్పుడు తానే నిర్మాతగా మారారు.

 Hero Karthikeya speech in NVNN pre release event

'హిప్పీ' ప్లాప్ తర్వాత నేను కోలుకోవడానికి టైమ్ పట్టింది. ఏడెనిమిదేళ్లల్లో సందీప్ అన్న ఎన్నో అప్ అండ్ డౌన్స్ చూశారు. స్ట్రాంగ్‌గా నిల‌బ‌డ్డారు. ద‌ట్స్ రియ‌ల్లీ ఇన్‌స్ఫైరింగ్‌. జూలై 12న లాస్ట్ ఇయర్ మా 'ఆర్ ఎక్స్ 100' విడుదలైంది. ఈ ఇయర్ 'నిను వీడని నీడను నేనే' వస్తుంది. ఈ సినిమా టీజర్, ట్రైలర్ చాలా బావున్నాయి. ఇదీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌ అవుతుంది" అని అన్నారు.

కాగా, గెస్టులుగా హాజరైన హీరోలకు సినిమా సెకండ్ టికెట్‌ను సందీప్ కిషన్ అందజేశారు. సెంటిమెంట్‌గా ఫ‌స్ట్ టికెట్ ఎవ‌రికి ఇస్తామ‌నేది గురువారం చెబుతామ‌ని సందీప్ తెలిపారు. ఈ ఫంక్ష‌న్‌ను 'జె మీడియా ఫ్యాక్టరీ' నరేంద్ర ఆర్గనైజ్ చేశారు. మంజుష, భార్గవ్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఛోటా కె. నాయుడు, APR ప్రాజెక్ట్స్ అధినేత సంజీవ్ రెడ్డిగారు, టైల్స్ మార్ట్ అధినేత జగ్గారావుగారు, సుప్రియగారు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X