‘ఆర్ఎక్స్ 100’ కంటే పెద్ద హిట్ కొట్టబోతున్నా: ‘హిప్పి’పై కార్తికేయ

Recommended Video

Hero Kartikeya Speech At Hippi Movie Press Meet || Filmibeat Telugu

'ఆర్ఎక్స్ 100' సినిమా విజయంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొత్త కుర్రాడు కార్తికేయ త్వరలో 'హిప్పి' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. టిఎన్ కృష్ణ దర్శకత్వం వహించిన మూవీ టీజర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. కాంటెంపరరీ రిలేషన్స్, లవ్, రొమాన్స్ లాంటి అంశాలను బేస్ చేసుకుని ఈ చిత్రం రూపొందించారు. తాజాగా 'హిప్పి' చిత్ర బృందం హైదరాబాద్‌లో మీడియాతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా కార్తికేయ మాట్లాడుతూ... 'ఆర్ఎక్స్ 100' సినిమా కంటే పెద్ద హిట్‌గా 'హిప్పి' నిలుస్తుందనే నమ్మకం ఉందని తెలిపారు.

‘హిప్పి’ నా తొలి చిత్రానికి పూర్తి భిన్నమైన సినిమా

‘హిప్పి’ నా తొలి చిత్రానికి పూర్తి భిన్నమైన సినిమా

‘‘బ్లాక్ బస్టర్ మూవీ ‘ఆర్‌ఎక్స్ 100' 25 డేస్ సెల్రబ్రేషన్స్ సమయంలో ఎంత సంతోషంగా ఉన్నానో.. ఇపుడు అంతే సంతోషంగా ఉంది. ‘హిప్పి' మూవీ అంతకంటే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఆర్ఎక్స్ 100 తర్వాత చాలా కథలు విన్నాను. అయితే అందులో నాకు బాగా నచ్చిన కథ, వెంటనే చేయాలని అనిపించన కథ ‘హిప్పి'... ఇది నా తొలి చిత్రానికి పూర్తి భిన్నంగా ఉంటుంది'' అని కార్తికేయ తెలిపారు.

వాస్తవాలకు దగ్గరగా ఉండే సినిమా

వాస్తవాలకు దగ్గరగా ఉండే సినిమా

‘‘హిప్పి' వినోదాత్మకంగా ఉంటూ నన్ను నేను పూర్తి డిఫరెంటుగా ప్రజెంట్ చేసుకునేలా ఉంటుంది. డైరెక్టర్ కృష్ణ గారు గౌతమ్ మీనన్ వద్ద పని చేశారు కాబట్టి నాకు కథ చెప్పడానికి పిలిచినపుడు ఈ సినిమా చాలా క్లాస్‌గా ఉంటుందేమో అనుకున్నాను. ఆయన కథ చెప్పిన తర్వాత అర్థమైంది ఆయన పక్కా వినోదాత్మక చిత్రాలు తీసే దర్శకుడు అని. వాస్తవానికి దగ్గరగా ఉండే సినిమా, ఎక్కడా అవాస్తవంగా, అలా ఎలా జరుగుతుంది? అనే డౌట్ రాదు.'' అని కార్తికేయ చెప్పకొచ్చారు.

ఇంత పెద్ద సినిమా అవుతుందనుకోలేదు

ఇంత పెద్ద సినిమా అవుతుందనుకోలేదు

ఈ సినిమా కథ విన్నపుడు ఇంత పెద్ద సినిమా అవుతుందని అనుకోలేదు. ఆయన చెన్నై వెళ్లిన తర్వాత కబాలి నిర్మాత ఎస్ థానుతో మాట్లాడించారు. ఆయన ఈ సినిమా టేకప్ చేస్తున్నారని తెలిసి షాకయ్యాను. ఆ తర్వాత ఆర్డీ రాజశేఖర్ సర్ ప్రాజెక్టులోకి వచ్చారు. సినిమా షూటింగులో ప్రతీ మూమెంట్ ఎంజాయ్ చేశాను.

అందరూ నాకంటే సీనియర్లే

అందరూ నాకంటే సీనియర్లే

‘‘ఈ చిత్రంలో జేడీ చక్రవర్తి చాలా ముఖ్యమైన పాత్ర చేశారు. ఆ పాత్రకు ఆయన తప్ప మరెవరూ సూట్ కారని అనిపించింది. తర్వాత దిగాంగన సూర్యవంశీ సినిమాలోకి ఎంటరయ్యారు. ఆమె హిందీలో చాలా ఫేమస్. వీర అనే సీరియల్‌లో తనే టైటిల్ రోల్ పోషించింది. సినిమాకు పని చేసిన అందరూ నాకంటే సీనియర్లే. వారి మధ్య బాగా బ్లెండ్ అయి ఎక్కడా తగ్గకుండా చేయడానికి ట్రై చేశాను.'' అని కార్తికేయ వ్యాఖ్యానించారు.

హిప్పి

హిప్పి

కార్తికేయ సరసన దిగాంగన సూర్యవంశీ, జజ్బా సింగ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టి.ఎన్‌.కృష్ణ ద‌ర్శ‌కత్వంలో వి క్రియేష‌న్స్ , ఏషియన్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రానికి కెమెరా: ఆర్‌.డి. రాజ‌శేఖ‌ర్, సంగీతం: నివాస్ కె.ప్ర‌స‌న్న, ఎడిటింగ్‌: ప‌్ర‌వీణ్ కె.ఎల్‌, స్టంట్‌: దిలీప్ సుబ్బ‌రాయ‌న్‌.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X