కంగ్రాట్స్..కృష్ణ,బ్రహ్మానందం

ఇది 'పద్మానందం' తన తల్లిదండ్రులు బ్రహ్మానందం అనే పేరు పెట్టినందుకు సార్థకత చేకూరిందని, గతంలో ఎన్నో అవార్డులు, రివార్డులు తనను వరించిన పొంగిపోకుండా ఎంత ఎదిగానా ఒదిగి ఉంటూనే.. అందరినీ నవ్వించడమే జీవిత లక్ష్యమని నవ్వుల రేడు బ్రహ్మానందం అన్నారు. ఎన్ని అవార్డులు వరించినా కోతి కోతిలానే ఉంటుందని, అందరినీ నవ్విస్తూ ఉంటుందని తనపైనే జోక్ వేసుకుంటున్నారు.
కృష్ణ కృషికి ఫలితం నటుడిగా,నిర్మాతగా,దర్శకుడిగా, స్టూడియో అధినేతగా, పంపిణీదారుడిగా, ప్రదర్శనదారుడిగా గత 45 ఏళ్లుగాకళారంగానికి చేస్తున్న కృషికి గుర్తింపుగా పద్మభూషణ్' పురస్కారం దక్క డం చాలా ఆనందంగా ఉంది. నా అభిమాను లు కూడా సంతోషంగా ఉన్నారు. గత ఏడాదిఆంధ్రా యూనివర్సిటీ నుంచి డాక్టరేట్' అందుకున్నానన్నారు.
అయితే.. ఈ ఏడాది పదిమందికి పద్మవిభూషణ్ అవార్డులను ప్రకటించినా వారిలో ఒక్కరు కూడా తెలుగువారు లేరు. ఇక.. 30 మందికి పద్మభూషణ్ పురస్కారాలను ప్రకటించినా సినీరంగం నుంచి సూపర్‌స్టార్ కృష్ణకు మాత్రమే ఈ అవార్డు దక్కింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సు చేసిన వారిలో సినీ రంగానికే చెందిన సీనియర్లు గుమ్మడి వెంకటేశ్వరావు, బాపు, రమణ వంటి మహామహులు ఉండటం గమనార్హం.పద్మాలు సాధించుకున్న ప్రముఖలందరికీ పేరుపేరునా దట్స్ తెలుగు అభినందనలు తెలుపుతోంది.


Click it and Unblock the Notifications











