కృష్ణగారూ ఈ భజన ఏంటి
హైదరాబాద్ : తెలుగు చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకుంటున్న నిర్ణయాలను ప్రముఖ నటుడు కృష్ణ అభినందించటం ఇప్పుడు టాలీవుడ్ సిని వర్గాలను ఆశ్చర్యం ముంచేసింది. ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎన్నడూ లేనిది,ఇప్పటివరకూ ఎవరూ పొగడని రీతిలో ఇలా కృష్ణగారు ఈ తరహా భజన చేయటమేంటి అంటున్నారు. అయితే ఆ మాటలు ఆయన హృదయంలోంచి వచ్చినవే కానీ ఇక్కడ తెలంగాణా ప్రభుత్వం నుంచి ఏదో ఆశించి అన్నవి కాదని, ఆయన సన్నిహితులు అంటున్నారు.
కృష్ణ ... ''చిత్ర పరిశ్రమ అభివృద్ధి కోసం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా కృషి చేస్తున్నారు. సినిమా సిటీ పేరుతో రెండు వేల ఎకరాలను ప్రకటించడం ఆనందంగా ఉంది. ఆ ప్రదేశంలో అంతర్జాతీయ స్థాయిలో స్టూడియోలు నిర్మించేలా ఆయన ప్రణాళిక వేస్తున్నారు. అందరూ దీనికి ఏ పేరు బాగుంటుందా అని చూస్తున్నారు. నాకైతే మాత్రం 'కేసీఆర్ సినిమా సిటీ' అని పెడితే బాగుంటుంది'' అన్నారు కృష్ణ.

అలాగే.. రెండు వేల ఎకరాల్లో సినిమా సిటీని నిర్మిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. రాబోయే రోజుల్లో అంతర్జాతీయ సినీ కేంద్రంగా హైదరాబాద్ మారబోతుందనడానికి ఇదొక శుభసూచకమని అభిప్రాయపడ్డారు. హాలీవుడ్ స్థాయిలో సినీ స్టూడియోలను నిర్మించే సత్తా కేసీఆర్‌కి ఉందనీ, అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఇతర దేశాల నుంచి కూడా సినిమా షూటింగులు చేసుకోవడానికి ఇక్కడకు వస్తారని పేర్కొన్నారు.


Click it and Unblock the Notifications











