twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    పోర్న్ చూసే మానసిక రోగివి.. విదేశాల్లో ఉండే నీకేం తెలుసు.. ఎన్నారై దుమ్ము దులిపిన హీరో మాధవన్

    |

    Recommended Video

    Actor R.Madhavan Slams NRI In Twitter || Filmibeat Telugu

    విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న హీరో మాధవన్ ఓ ఎన్నారైకి గట్టిగా బుద్ధి చెప్పాడు. భారతీయ సంస్కృతి, భక్తుల మనోభావాల గురించి మీకేం తెలుసు అని గట్టిగా సమాధానం చెప్పారు. ఇటీవల వేలాది భక్తులు ఊరేగింపుగా వెళ్తుండగా.. ఆ సమయంలో వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ భక్తుల మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ఈ పోస్టుకు అభిషేక్ బచ్చన్‌తోపాటు అనేక మంది నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతకు ఈ వీడియో గురించి ఏం జరిగిందంటే..

    హీరో మాధవన్ వీడియోపై

    హీరో మాధవన్ వీడియోపై

    హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోపై ఓ ఎన్నారై తన ట్విట్టర్‌ అకౌంట్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పండుగ ఊరేగింపును గేలి చేస్తూ కామెంట్లు పెట్టాడు. అంతమంది ఊరేగింపుగా వెళ్లడం అనాగరిక చర్య. మాధవన్ వీడియోను అపహాస్యం చేస్తూ అడ్డదిడ్డంగా మాటలు వదిలాడటం వివాదంగా మారింది.

    భక్తుల తీరును ఎన్నారై అసభ్యంగా

    ఎన్నారై పోస్టుపై మాధవన్ స్పందిస్తూ.. ఈ వీడియోలో మంచి ఏమిటంటే.. వేలాది మంది భక్తులు అంబులెన్స్ దారి ఇవ్వడం. లాస్ ఎంజెలెస్‌లో ఉండే వారికి ఇలాంటి సెన్స్ ఉండదు. పాజిటివ్ యాటిట్యూడ్ లేని నీకు ఎంత చెప్పినా ఇలాంటి విషయాలు అర్థం కావులే. నీ వీడియో వల్ల నీవు ఎంత భావ దరిద్రంతో బాధపడుతున్నావో అర్థం అవుతున్నది అని మాధవన్ పేర్కొన్నారు.

    పోర్న్ చూసే వాడికి...

    పోర్న్ చూసే వాడికి...

    విదేశాల్లో నిత్యం అసభ్య వీడియోలు (గూనర్ బజ్) చేసే వాడికి ఇలాంటి పట్టవు. త్వరలోనే ఈ మానసిక రోగం నుంచి బయటపడాలాని కోరుకొంటున్నాను అని ఎన్నారైకి మాధవన్ గట్టిగా జవాబిచ్చారు. మాధవన్‌కు తోడుగా అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. భారతీయ సంస్క‌ృతి, నాగరికత వారికి అర్థం కావులే అనే విధంగా ట్వీట్ చేశారు.

    ‘రాకెట్రీ' మూవీలో మాధవన్

    ‘రాకెట్రీ' మూవీలో మాధవన్

    మాధవన్ కెరీర్ విషయానికి వస్తే, అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. ఇటీవల మాధవన్ మంగ్లీయర్ మాట్టం, విక్రమ్ వేద చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.

    English summary
    Actor Madhavan took to Twitter to share a video of a temple festival in which hundreds of devotees made way to an ambulance. However, a Twitter user from abroad mocked the whole festival and called the whole gathering uncivilized and laughed at the actor's post. Madhavan was quick to give it back to the user.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X