Don't Miss!
- News ఎమ్మెల్యే రాజా సింగ్ పై కేసు నమోదు
- Sports PBKS vs MI: రోహిత్ శర్మ ట్రేడ్ మార్క్ సిక్సర్.. హార్దిక్ రియాక్షన్ వైరల్! వీడియో
- Lifestyle గుడ్‌నైట్ సందేశాలను ఇలా సరదాగా పంపుకోండి..
- Technology 40 గంటలకు పైగా బ్యాటరీ బ్యాకప్, ChatGPT వాయిస్ AI సపోర్టుతో నథింగ్ ఇయర్‌బడ్స్ విడుదల.. సేల్ వివరాలు!
- Automobiles గొప్ప మనసు చాటుకున్న రాఘవ లారెన్స్.. దివ్యాంగులకు టీవీఎస్ స్కూటర్ల పంపిణీ
- Finance Market Closing: నష్టాల్లోకి జారుకున్న సెన్సెక్స్-నిఫ్టీ.. ఆ రెండిటిపైనే అందరి కన్ను..
- Travel ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయంలో టీటీడీ అన్నప్రసాదం ప్రారంభం..
పోర్న్ చూసే మానసిక రోగివి.. విదేశాల్లో ఉండే నీకేం తెలుసు.. ఎన్నారై దుమ్ము దులిపిన హీరో మాధవన్
Recommended Video
విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకొన్న హీరో మాధవన్ ఓ ఎన్నారైకి గట్టిగా బుద్ధి చెప్పాడు. భారతీయ సంస్కృతి, భక్తుల మనోభావాల గురించి మీకేం తెలుసు అని గట్టిగా సమాధానం చెప్పారు. ఇటీవల వేలాది భక్తులు ఊరేగింపుగా వెళ్తుండగా.. ఆ సమయంలో వచ్చిన అంబులెన్స్‌కు దారి ఇచ్చిన వీడియోను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ భక్తుల మానవీయ కోణాన్ని బయటపెట్టాడు. ఈ పోస్టుకు అభిషేక్ బచ్చన్‌తోపాటు అనేక మంది నుంచి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఇంతకు ఈ వీడియో గురించి ఏం జరిగిందంటే..
హీరో మాధవన్ వీడియోపై
హీరో మాధవన్ షేర్ చేసిన వీడియోపై ఓ ఎన్నారై తన ట్విట్టర్ అకౌంట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. పండుగ ఊరేగింపును గేలి చేస్తూ కామెంట్లు పెట్టాడు. అంతమంది ఊరేగింపుగా వెళ్లడం అనాగరిక చర్య. మాధవన్ వీడియోను అపహాస్యం చేస్తూ అడ్డదిడ్డంగా మాటలు వదిలాడటం వివాదంగా మారింది.
|
భక్తుల తీరును ఎన్నారై అసభ్యంగా
ఎన్నారై పోస్టుపై మాధవన్ స్పందిస్తూ.. ఈ వీడియోలో మంచి ఏమిటంటే.. వేలాది మంది భక్తులు అంబులెన్స్ దారి ఇవ్వడం. లాస్ ఎంజెలెస్‌లో ఉండే వారికి ఇలాంటి సెన్స్ ఉండదు. పాజిటివ్ యాటిట్యూడ్ లేని నీకు ఎంత చెప్పినా ఇలాంటి విషయాలు అర్థం కావులే. నీ వీడియో వల్ల నీవు ఎంత భావ దరిద్రంతో బాధపడుతున్నావో అర్థం అవుతున్నది అని మాధవన్ పేర్కొన్నారు.
పోర్న్ చూసే వాడికి...
విదేశాల్లో నిత్యం అసభ్య వీడియోలు (గూనర్ బజ్) చేసే వాడికి ఇలాంటి పట్టవు. త్వరలోనే ఈ మానసిక రోగం నుంచి బయటపడాలాని కోరుకొంటున్నాను అని ఎన్నారైకి మాధవన్ గట్టిగా జవాబిచ్చారు. మాధవన్‌కు తోడుగా అభిషేక్ బచ్చన్ స్పందిస్తూ.. భారతీయ సంస్కృతి, నాగరికత వారికి అర్థం కావులే అనే విధంగా ట్వీట్ చేశారు.
‘రాకెట్రీ' మూవీలో మాధవన్
మాధవన్ కెరీర్ విషయానికి వస్తే, అంతరిక్ష శాస్త్రవేత్త నంబి నారాయణన్ బయోపిక్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ అని పేరు పెట్టారు. ఇటీవల మాధవన్ మంగ్లీయర్ మాట్టం, విక్రమ్ వేద చిత్రాల్లో నటించారు. ఈ రెండు చిత్రాల్లో ఆయన నటనకు మంచి పేరు వచ్చింది.