Don't Miss!
- Technology ధర రూ.9,999 కే 108MP కెమెరా, 8GB ర్యామ్ స్మార్ట్‌ఫోన్.. కొనుగోలుపై స్మార్ట్‌వాచ్ ఉచితం..!
- Finance Swiggy IPO: ఐపీఓగా రానున్న స్విగ్గీ..!
- News ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలకు షాక్; కోడ్ ఉల్లంఘనలపై ఈసీ నోటీసులు
- Automobiles వందేభారత్ రైళ్లలో 1 లీటర్ వాటర్ బాటిల్ రద్దు.. రైల్వే శాఖ కీలక నిర్ణయం
- Lifestyle వేసవిలో మైగ్రేన్ తలనొప్పి ఎందుకు పెరుగుతుంది, లక్షణాలు, ఉపశమనం ఎలా పొందాలో తెలుసుకోండి
- Sports SRHను చూస్తే భయమేస్తోంది- పాక్ దిగ్గజం
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
యవ్వనంలో నేనూ...మహేష్ బాబు
యవ్వనమనేది చాలా వత్తిడిని కలిగించే పీరియడ్. మీరు నమ్ముతారో, లేదో..నేను కూడా 12 స్టాండర్డ్ పూర్తిచేసి కాలేజీలోకి అడుగు పెట్టేప్పుడు అలాంటి వత్తిడిని ఎదుర్కొన్నా. కెరీర్ పరంగా ఏమి సాధించబోతున్నాం, మనమేమైపోతున్నాం..అనే ఆలోచనలు రేకెత్తే కాలమది. సాధారణంగా యువత తప్పటడుగులు వేసే వయసు కూడా అదే. డ్రగ్స్ లేదా ఆల్కహాల్ తీసుకోవడం వంటి చెడు అలవాట్లకు బానిసలయ్యే అవకాశం ఎక్కువ. అలాంటివాళ్లకు ఇది చక్కని సందేశాన్నిచ్చే, స్ఫూర్తినిచ్చే పర్ఫెక్ట్ ఫిల్మ్ అంటూ చైనా చిత్రం 'ఇన్విజిబుల్ వింగ్స్' (తెలుగులో 'నింగీ..నేల..నాదే')చూసిన హీరో మహేష్ మీడియాతో చెప్పారు.ఫెంగ్ జెంజి దర్శకత్వంలో లీచింగ్ యావో ప్రధాన పాత్ర పోషించిన ఈ చిత్రాన్ని సుజన్ మీడియా వర్క్స్ ప్రై. లిమిటెడ్ పతాకంపై చావ సుధారాణి అందిస్తున్నారు.
ఇంకా మహేష్ మాట్లాడుతూ ఇటీవలి కాలంలో నేను చూసిన మోస్ట్ ఇన్స్పిరేషనల్ అండ్ మోటివేషనల్ సినిమాల్లో ఒకటి. ఒక యాక్సిడెంట్లో రెండు చేతులూ కోల్సోయిన ఒక అమ్మాయి, నిరాశ చెందకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధించడం స్ఫూర్తిదాయకం. కాళ్లతోటే బ్రష్ చేసుకోవడం, సూరిలో దారం గుచ్చి బట్టలు కుట్టడం, బొమ్మలు గీయడం, సైకిల్ తొక్కడం, స్విమ్మింగ్ చేయడం చూసినప్పుడు ఇదసలు సాధ్యమేనా అనిపించింది. నమ్మలేకపోయా. నిరంతర సాధనతో ఏమైనా చేయొచ్చుననడానికి గొప్ప ఉదాహరణ ఆ అమ్మాయి అన్నారు. మరీముఖ్యంగా కుర్రాళ్లు. చిన్న చిన్న వత్తిళ్లకే బెంబేలెత్తి పోతున్నారు. అలాంటి వాళ్లకందరికీ ఈ సినిమా ఇన్స్పిరేషన్.