twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహేష్ గ్రేట్... ఇంకో సినిమాకు సబ్జెక్టు రెడీ: దిల్ రాజు

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: నిర్మాత దిల్ రాజు హీరో మహేష్ బాబుపై పొగడ్తల వర్షం కురిపించారు. ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టిన రోజును పురస్కరించుకుని 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన సంద్భంగా ఆయన మహేష్ గురించి తన అభిప్రాయం వెల్లడించారు. మహేష్ బాబు గ్రేట్ హీరో. ఆయనతో వర్క్ చెయ్యడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా నిర్మాణంలో ఉండగానే ఇంకో సినిమా చెయ్యడానికి సబ్జెక్టు రెడీ చేస్తున్నామంటే ఎంత హ్యాపీగా ఉన్నామో మీరే ఊహించుకోండి. నిర్మాతల శ్రేయస్సు కోరే మహేష్ నిండు నూరేళ్లు ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని కోరుకుంటూ మా హీరో విక్టరీ వెంకటేష్ తరుపున, మా సంస్థ తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు.

    కో ప్రొడ్యూసర్స్ శిరీష్, లక్ష్మణ్ మాట్లాడుతూ...సూపర్ స్టార్ మహేష్ చేసిన 'పోకిరి' మా డిస్ట్రిబ్యూషన్ ద్వారా నైజాంలో రిలీజ్ చేసాం. ఆ చిత్రం ఎన్ని రికార్డులు సృష్టించిందో అందరికీ తెలుసు. మహేష్ గారితో మా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్లో 'సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' చిత్రం చెయ్యడం, మా షూటింగ్ షెడ్యూల్‌లో మహేష్ బర్త్ డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఈచిత్రం చివరి షెడ్యూల్ ఆగస్టు 10 నుంచి సినిమా పూర్తయ్యే వరకు ఏకధాటిగా జరుగుతుంది. సూపర్ స్టార్ మహేష్ కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఆయన మరిన్ని చిత్రాలు మా బేనర్లో చేయాలని కోరుకుంటున్నామని అన్నారు.

    సమంత, అంజలి, ప్రకాష్ రాజ్, జయసుధ, రోహిణి హట్టంగడి, రావు రమేష్, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, రమాప్రభ, తనికెళ్ల భరణి, కోట శ్రీనివాసరావు, రవిబాబు తదితరులు నటిస్తున్న ఈచిత్రానికి సంగీతం: మిక్కీ జె. మేయర్, కెమెరా: కె.వి.గుహన్, కళ: ఎ.ఎస్. ప్రకాష్, ఎడిటింగ్: మార్తాండ్ కె. వెంకటేష్, సహ నిర్మాతలు: శిరీష్, లక్ష్మణ్, నిర్మాత: దిల్ రాజు, కథ- స్క్రీన్ ప్లే- మాటలు- దర్శకత్వం: శ్రీకాంత్ అడ్డాల.

    English summary
    "Mahesh Babu is a great hero and understands the producers well. I am very happy and thrilled to have worked with him on this movie" Dil Raju said. August 9th marks the birthday of superstar Mahesh Babu, Dil Raju released the first look posters of his multi-starrer Seetamma Vakitlo Sirimalle Chettu.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X