Manchu Manoj: పొలిటికల్ ఎంట్రీ కోసమే పెళ్లి అంటూ కామెంట్స్.. కూల్‌గా కౌంటర్ ఇచ్చేసిన మనోజ్..!

టాలీవుడ్ నటుడు మంచు మనోజ్ ఇటీవల కుటుంబ సభ్యుల సమక్షంలో పెద్దగా హడావిడి లేకుండా సైలెంట్ గా పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అయితే మంచు మనోజ్ ఈ పెళ్లి చేసుకోవడానికి మరొక కారణం ఉంది అనే కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పొలిటికల్ ఎంట్రీ కోసమే మనోజ్ ఈ విధంగా చేసి ఉండవచ్చు అని కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో మనోజ్ చాలా సింపుల్ గా ఒక కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. పొలిటికల్ ఎంట్రీపై కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాల్లోకి వెళితే..

ప్రేమ వివాహం

ప్రేమ వివాహం

మంచు మనోజ్ తన మొదటి భార్య నుంచి విడాకులు తీసుకున్న తర్వాత చాలా కాలంగా సింగిల్ గానే ఉంటున్నట్లు టాక్ వచ్చింది. అయితే తన ప్రేమ విషయాన్ని మాత్రం ఆయన ఎక్కడగా బయట పెట్టలేదు. భూమా అఖిల ప్రియ సోదరి భూమా మౌనికతో ఆయన ప్రేమలో ఉన్న విషయం ఇండస్ట్రీలో అతికొద్ది మందికి మాత్రమే తెలుసు. ఇక మొత్తానికి ఆ విషయాన్ని మనోజ్ అధికారికంగా పెళ్లి వార్తతో తెలియజేశారు.

సాంప్రదాయ పద్ధతిలో

సాంప్రదాయ పద్ధతిలో

ఇటీవల మంచు వారి కుటుంబ సభ్యుల సమక్షంలో మంచు మనోజ్ చాలా సింపుల్ గా వివాహం చేసుకున్నాడు. హిందూ సాంప్రదాయ పద్ధతిలో మనోజ్ మౌనిక ఇద్దరూ కూడా ఏడడుగులు వేశారు. ఇక వారిద్దరికి సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా వారికి ప్రత్యేకంగా ఫ్యాన్స్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నారు.

రాజకీయాల్లో మనోజ్

రాజకీయాల్లో మనోజ్

అయితే భూమా ఫ్యామిలీ చాలాకాలంగా రాజకీయాల్లో బిజీగా ఉన్నారు కాబట్టి మంచి మనోజ్ కూడా ఇప్పుడు వారి అమ్మాయిని పెళ్లి చేసుకుని అటువైపు అడుగులు వేసే అవకాశాలు ఉన్నట్లుగా ఒక టాక్ వినిపిస్తోంది. గతంలో పలు రాజకీయ అంశాలపై కూడా మనోజ్ స్పందించిన విషయం తెలిసిందే. దీంతో అప్పటి నుంచే అతను పాలిటిక్స్ లోకి రావాలని అనుకుంటున్నట్లుగా కథనాలు వచ్చాయి.

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం

ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం

అయితే ఇప్పుడు భూమా మౌనిక తో పెళ్లి జరగడంతో మంచు మనోజ్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఉంది అని కూడా కథనాలు వెలువడ్డాయి. అయితే ఈ విషయంలో రకరకాల నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తూ ఉండడంతో మంచి మనోజ్ చాలా సింపుల్ గానే వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. తనకు రెగ్యులర్ పొలిటిక్స్ లోకి వచ్చే ఆసక్తి లేదని కుండబద్దలు కొట్టేసాడు.

క్లారిటీ ఇచ్చిన మనోజ్

క్లారిటీ ఇచ్చిన మనోజ్

అయితే ప్రజాసేవలో మాత్రం తను ఎప్పటిలాగే చాలా బిజీగా ఉంటాను అని కూడా మనోజ్ వివరణ ఇచ్చాడు. ఆ ఆలోచన విధానమే మా ఇద్దరినీ ఈరోజు ఒకటి చేసింది అని అయితే మౌనిక రాజకీయాల్లోకి వెళతాను అంటే తన ఇష్ట ప్రకారం వెళ్లినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదు అని కానీ వీలైనంతవరకు కలిసి ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన తమకు ఉంది అని మనోజ్ తెలిపాడు. అంతేకాకుండా రెగ్యులర్ పాలిటిక్స్ లోకి వచ్చే ఆలోచన లేదని కూడా మనోజ్ వివరణ ఇచ్చాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X