పండంటి బిడ్డకు తండ్రైన మంచు మనోజ్.. ఎవరూ ఊహించని నిక్ నేమ్ పెట్టిన మేనత్త
టాలీవుడ్ స్టార్ హీరో మోహన్ బాబు కుమారుడిగా సినిమాల్లోకి ఎంటరై.. తనదైన చిత్రాలతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్నాడు టాలెంటెడ్ హీరో మంచు మనోజ్. సినీ కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేసిన అతడు.. హీరోగా పెద్దగా సక్సెస్ కాలేకపోయాడు. పర్సనల్ లైఫ్‌లోనూ పెళ్లి బ్రేకప్ అవడంతో ఇబ్బందులు పడ్డాడు. ఇలాంటి పరిస్థితుల్లో మంచు మనోజ్ గత ఏడాదే భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని మంచు లక్ష్మి ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఆ వివరాలు మీకోసమే!
మౌనికతో మనోజ్ వివాహం
మంచు మనోజ్ తన చిన్ననాటి స్నేహితురాలు ప్రణతి రెడ్డితో చాలా కాలం ప్రేమాయణం సాగించి 2015లో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ, ఈ బంధం ఎంతో కాలం నిలవలేదు. దీంతో భార్యకు విడాకులు ఇచ్చాడు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీకి చెందిన భూమా మౌనిక రెడ్డిని మంచు మనోజ్ రెండో వివాహం చేసుకున్నాడు.

తండ్రైన మంచు మనోజ్
టాలీవుడ్ యంగ్ హీరో మంచు మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి కొద్ది రోజుల క్రితమే ప్రెగ్నెంట్ అయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆమె ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఆమె సాధారణ ప్రసవం ద్వారా తల్లి అయ్యారని తెలిసింది. ఇక, మనోజ్ ఇంట్లోకి వారసురాలు రావడంతో అతడి అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

గుడ్ న్యూస్ చెప్పిన లక్ష్మి
మంచు మనోజ్ - మౌనిక రెడ్డి దంపతులకు పాప జన్మించిన విషయాన్ని మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ఈ మేరకు తన X (ట్విట్టర్) ఖాతాలో 'ఇప్పుడు వాళ్లు నలుగురు అయ్యారు. ఆ భగవంతుడి ఆశీర్వాదంతో మా కుటుంబంలోకి మరో దేవత వచ్చింది' అంటూ తెలిపింది. అంతేకాదు, AI టెక్నాలజీతో చేసిన రెండు పోస్టర్లను కూడా ఆమె షేర్ చేశారు.
నిక్ నేమ్ కూడా పెట్టేసి
ఇదే ట్వీట్‌లో మంచు లక్ష్మి 'మంచు మనోజ్, మౌనిక ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారని చెప్పడానికి మేమంతా సంతోషిస్తున్నాము. ఆమె అన్నయ్య ధైరవ్ ఆనందానికి అవధులు లేవు. ఆమెను (పాప) మేమంతా MM పులి అని పిలుస్తాము. ఈ కుటుంబానికి ఆ శివుని సంపూర్ణ ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. మీ అందరూ కూడా వాళ్లను ఆశీర్వదించడండి' అని చెప్పారు.
శుభాంకాంక్షల వెల్లువ
టాలీవుడ్ టాలెంటెడ్ హీరో మంచు మనోజ్, మౌనిక రెడ్డి దంపతులకు ఆడబిడ్డ జన్మించడంతో మంచు ఫ్యామిలీలో సంబరాలు మిన్నంటాయి. ఈ బుల్లి ప్రిన్సెస్ రాకతో వాళ్ల అభిమానులు, సెలెబ్రిటీల నుంచి మనోజ్ దంపతులకు శుభాకాంక్షలు భారీ స్థాయిలో వెల్లువెత్తాయి. దీంతో మంచు మనోజ్‌కు కూతురు పుట్టిందన్న న్యూస్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.


Click it and Unblock the Notifications











