భారీ లాభాల్లో మనం- మొక్కు తీర్చుకున్న నాగార్జున
తిరుమల: సినీనటుడు నాగార్జున, ఆయన సతీమణి అమల శనివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం అనంతరం నాగార్జున విలేకర్లతో మాట్లాడుతూ 'మనం' చిత్రం విజయం సాధించడంతో మొక్కు తీర్చుకునేందుకు తిరుమల వచ్చానట్లు తెలిపారు. మనం సినిమా తరువాత ఇంకా ఏ సినిమాకు సంతకం చేయలేదని.. మంచి కధ వస్తే అప్పుడు ఆలోచిస్తానని ఆయన చెప్పారు.
తెలుగు సినిమా పరిశ్రమకు నైజాం ఏరియా ప్రధాన ఆదాయ వనరుగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఏ తెలుగు సినిమాకైనా అత్యధిక ఆదాయం వచ్చేది ఈ ఏరియా నుండే. నైజాంలో భారీ లాభాలు వచ్చాయంటే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయినట్లే లెక్క. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, జూ ఎన్టీఆర్, ప్రభాస్ లాంటి అగ్రహీరోల హీరోల సినిమాలకు ఈ ఏరియాలో కనక వర్షం కురుస్తుంది.

తాజాగా అక్కినేని మల్టీ స్టారర్ మూవీ 'మనం' చిత్రం కూడా నైజాంలో భారీ వసూళ్లు సాధించిన లిస్టులో చేరి పోయింది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం నైజాం షేర్ రూ. 10 కోట్లు క్రాస్ అయింది. అక్కినేని ఫ్యామిలీ హీరోల సినిమాలకు సంబంధించిన ఇదో రేర్ ఫీట్ అని చెప్పొచ్చు. ఇక వరల్డ్ వైడ్ 'మనం' చిత్రం వసూలు చేసిన షేర్ రూ. 30 నుండి 35 కోట్ల మధ్యలో ఉంటుందని అంచనా.
అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జున, నాగచైతన్య కలసి నటించిన చిత్రం 'మనం'. సమంత, శ్రియ హీరోయిన్స్. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో అక్కినేని కుటుంబం ఈ చిత్రాన్ని నిర్మించింది. ఈ చిత్రానికి మాటలు : హర్షవర్ధన్, పాటలు : చంద్రబోస్, వనమాలి, డాన్స్ : బృంద, ఫైట్స్ : విజయ్, కాస్ట్యూమ్స్: నళిని శ్రీరామ్, ఫోటోగ్రఫీ : పి.ఎస్.వినోద్, సంగీతం : అనూప్ రూబెన్స్, ఆర్ట్ :రాజీవన్, ఎడిటింగ్ : ప్రవీణ్ పూడి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: వై.సుప్రియ, నిర్మాత : నాగార్జున అక్కినేని, కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం : విక్రమ్ కె.కుమార్.


Click it and Unblock the Notifications











