Nagarjuna: నాగార్జున 'కూలి' క్రేజీ యాక్షన్ సీన్ లీక్.. కంగుతిన్న మూవీ మేకర్స్..
Nagarjuna Coolie: తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటిస్తున్న కూలీ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున కీలకపాత్రను పోషిస్తున్న విషయం తెలిసిందే. మూవీ యూనిట్ ఈ విషయన్ని కింగ్ నాగార్జున పుట్టిన రోజు సందర్భంగా అఫీషియల్ గా ప్రకటించారు. అలాగే.. కూలీ నుంచి నాగ్ పోస్టర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఈ సినిమా పోస్టర్, టైటిల్ టీజర్ విడుదల చేశారు. తాజా మరో మూవీకి సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ వీడియో లీక్ అయ్యింది. అందులో మన కింగ్ నాగార్జున మాస్ యాక్షన్ సీన్. మీరు కూడా ఓ లూక్కేయండి బాస్..
కోలీవుడ్ స్టార్ అండ్ సెన్సెషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కూలీ. ఈ మూవీలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్నారు. ఈ భారీ బడ్జెట్ మూవీని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఇక యాక్షన్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ మూవీ లో కన్నడ స్టార్ ఉపేంద్ర, స్టార్ హీరోయిన్ శృతి హాసన్, షౌబిన్ షాహిర్ తో పాటు టాలీవుడ్ టాప్ హీరో నాగార్జున కూడా కీలకపాత్రను పోషిస్తున్నారు. ఈ మల్టీ స్టారర్ మూవీలో కింగ్ నాగర్జున 'సైమన్' అనే పాత్రలో కనిపించబోతున్నారు.

తొలి సారి టాలీవుడ్ మన్మధుడు నెగిటివ్ షేడ్ లో కనిపించనున్నరని అఫీషియల్ గా అనౌన్స్ చేసి సినిమాపై భారీ గా అంచనాలు పెరిగాయి. అంతే కాకుండా ఈ మూవీ కోసం నాగ్ ఏకంగా 40 కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడనే రూమర్లు వైరల్ అవుతున్నాయి. ఇకపోతే.. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గత రెండు రోజుల కిత్రం ఈ మూవీ షూటింగ్ విశాఖ పోర్టు ప్రాంతంలో జరిగినట్టు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.. ఈ ప్రాంతంలో యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందులోనూ నాగార్జున పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కింగ్ నాగార్జున ఫైట్ చేస్తున్న సీన్ కు సంబంధించిన వీడియో ఒకటి లీకయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది.
సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఆ వీడియోలో.. నాగార్జున చుట్టూ వందల మంది ఉండగా ఓ వ్యక్తిని పట్టుకుని క్రూరంగా కొడుతున్నట్టు కనిపించారు. ఈ సమయంలో తమిళ్ లో డైలాగ్ చెబుతున్నట్టు కనిపించారు.ఈ వీడియో చూసిన నెట్టిజన్లు తమకు నచ్చిన రీతిలో కామెంట్స్ చేస్తున్నారు. విక్రమ్ సినిమాలో సూర్య రోలెక్స్ లాగాే.. కింగ్ నాగ్ క్యారెక్టర్ ఉండబోతుందని కామెంట్స్ చేస్తున్నారు. కింగ్ నాగ్ యాక్షన్ సీన్ తెగ వైరల్ కావడంతో ఈ మల్టీ సార్ట్ మూవీ పక్కా రూ.1000 కోట్లు కలెక్షన్స్ చేస్తుందంటూ కామెంట్స్ పెడుతున్నారు.

ఈ యాక్షన్ మూవీకి యంగ్ అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఏదేమైనా ఈ లీకైన వీడియో మాత్రం మూవీ మేకర్స్ కు షాక్ కు గురి చేస్తుంది. ప్రస్తుతం ఈ కూలీ మూవీ షూటింగ్ విశాఖపట్నంలో జరుగుతుండగా.. షూటింగ్ కు సమీపంలో భారీ ప్రమాదం జరిగిందని, అదృష్టవశాత్తు ఎవరూ ప్రమాదంలో గాయపడలేదని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











