అసిస్టెంట్ డైరెక్టర్ చేసింది సునీల్ అన్నే..!
Recommended Video

సునీల్, మనీషా రాజ్ జంటగా నటిస్తున్న చిత్రం 2 కంట్రీస్. మహాలక్ష్మి ఆర్ట్స్ పతాకంపై ఎన్.శంకర్ స్వీయ దర్శక నిర్మాణంలో సినిమాను రూపొందించారు. గోపీసుందర్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియో విడుదల కార్యక్రమం బుధవారం హైదరాబాద్‌లో జరిగింది. హీరో నాని ఆడియో సీడీలను విడుదల చేశారు.
నాని మాట్లాడుతూ - సునీల్ అన్నతో హీరో కాక ముందు నుండి మంచి పరిచయం ఉంది. ఢీ సినిమాకు నన్ను అసిస్టెంట్ డైరెక్టర్‌గా రెకమండ్ చేసింది సునీల్ అన్నే. నేను అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యే సమయానికి తను మంచి కమెడియన్‌గా పేరు తెచ్చుకునేశారు. కానీ నాతో ఎంతో సన్నిహితంగా మెలిగేవారు. నాలో కాన్ఫిడెంట్‌ను పెంచిన వ్యక్తి. ఇక 2 కంట్రీస్ సినిమా కంటెంట్ ఆల్ రెడీ ప్రూవ్ చేసుకున్న కంటెంట్. ఇక కామెడీ పరంగా సునీల్ అన్న చూసుకుంటాడు. సినిమా తప్పకుండా పెద్ద హిట్ అవుతుందనడంలో సందేహం లేదు అన్నారు.


Click it and Unblock the Notifications











