ఆ సినిమా హిట్ అయితే నాకు డేంజర్ ఉందని తెలిసినా కోరుకుంటున్నా: నాని

సక్సెస్‌ఫుల్ చిత్రాల హీరో అడవి శేష్ నటించిన తాజా చిత్రం 'ఎవరు'. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ యంగ్ హీరో 'క్ష‌ణం', 'గూఢ‌చారి' వంటి వినూత్న కథాంశాలతో తెరకెక్కిన చిత్రాల తర్వాత చేసిన సినిమా కావడంతో దీనిపై అంచనాలు బాగానే ఉన్నాయి. దీనికితోడు ఇది కూడా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్‌లో వస్తుండడంతో టాలీవుడ్‌లో 'ఎవరు' హాట్ టాపిక్ అయిపోయింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆ సినిమా ట్రైలర్ ఇప్పటి వరకు ఉన్న అంచనాలను రెట్టింపు చేసేసింది. దీన్ని నేచురల్ స్టార్ నాని విడుదల చేసిన విషయం తెలిసిందే. ముందుగా ప్రకటించిన దాని ప్రకారం ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నేచురల్ స్టార్ నాని.. ట్రైలర్‌ను విడుదల చేశాడు. అనంతరం అతడు మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్లు చేశాడు.

 Hero Nani comments on Adivi Sesh Evaru movie

ఈ కార్యక్రమంలో నాని మాట్లాడుతూ.. 'ఈ ట్రైలర్‌ను రెండు సార్లు ప్లే చేశారు. మీరు గమనిస్తే ఫస్ట్ ఇది ప్లే అయినప్పుడు ఎవరూ క్లాప్స్ కొట్టలేదు. రెండో సారి మాత్రం కొట్టారు. ఆ సైలెన్స్‌కు కారణం ఏంటంటే.. సడెన్‌గా మనం ఇప్పుడేం చూశాం అన్న షాక్‌లోకి వెళ్లిపోయారంతా. అందుకే క్లాప్స్ కొట్టలేదు. 1.40 నిమిషాల్లోని మనల్ని కథలోకి తీసుకెళ్లిపోయింది. ఇది చూసి దీనికి క్లాప్స్ కొట్టాలి అని మనం మర్చిపోయాం' అని అన్నాడు.

అలాగే 'ఈ సినిమా టీమ్ అంతా నాకు ఫ్యామిలీలా. 'గూఢచారి' ట్రైలర్ ఇక్కడ ఇదే ప్లేస్‌లో లాంచ్ చేశాను. అందుకే శేష్ అడగ్గానే నేను కూడా సెంటిమెంట్‌లా ఫీల్ అయ్యాను. బాధ్యతగా అనిపించింది. గూఢచారి ఎంత పెద్ద హిట్ అయిందో నాకు తెలుసు. ఈ సినిమా కూడా హిట్ అయితే.. శేష్ ప్రతి ట్రైలర్ నేనే లాంచ్ చేయాలన్న డేంజర్ ఉందని తెలిసినా కూడా మనస్ఫూర్తిగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నా' అని నాని చెప్పుకొచ్చాడు.

కొత్త దర్శకుడు రామ్ జీ‌ని ఇండస్ట్రీకి పరిచయం చేస్తూ.. పీవీపీ సినిమాస్ బ్యాన‌ర్‌‌లో 'ఎవరు' చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో క్రేజీ హీరోయిన్ రెజీనా క‌సండ్ర హీరోయిన్‌గా న‌టిస్తుంది. న‌వీన్ చంద్ర కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. 'ఎవరు' సినిమాను మొదట ఆగస్టు 23న విడుదల చేయాలని నిర్మాతలు నిర్ణయించారు. 'సాహో' వాయిదా పడటంతోనే విడుదల తేదీని ఆగస్టు 15కి మార్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X