పిల్లలు చూస్తున్నారు.. శృతి మించవద్దు.. టీవీ ఛానెల్స్‌కు నాని పంచ్..
తెలుగు టెలివిజన్ ఛానెల్లు, యూట్యూబ్ ఛానెల్స్‌తోపాటు వాటికి హోస్ట్‌గా వ్యవహరించే వారిపై నేచురల్ స్టార్ నాని తనదైన శైలిలో పంచ్ విసిరారు. టీవీ ఛానెళ్లను పిల్లలు చేస్తున్నారు. దయచేసి శృతిమించకండి అంటూ నాని ట్వీట్ చేశారు. సినీ హీరోయిన్లపై ఓ టీవీ యాంకర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో నాని ట్వీట్ చేసి ఉంటారని మీడియా వర్గాలు భావిస్తున్నాయి.
సినిమా పరిశ్రమను టార్గెట్‌గా చేసుకొని కొన్ని టీవీ ఛానెల్స్ చేస్తున్న దుష్ఫ్రచారాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పలు టీవీ ఛానెళ్లలో యాంకర్లు, ప్రజెంటర్స్ వ్యవహరిస్తున్న తీరు చాలా బాధాకరం. భవిష్యత్‌ను తీర్చిదిద్దాల్సిన బాధ్యత తమపై ఉందని మీడియా గ్రహించాలి అని నాని తన ట్వీట్‌లో పేర్కొన్నారు.



Click it and Unblock the Notifications











