twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    గ్యాంగ్ లీడ‌ర్ చిత్ర షూటింగ్‌లో ప్రమాదం.. ఆసుపత్రిలో నాని!

    |

    వ‌ర‌స సినిమాల‌తో జోరు మీదున్న నాచురల్ స్టార్ నాని ప్రమాదానికి గురయ్యారని వార్త ఆయన అభిమానులకు కలవరపెడుతోంది. ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తన కొత్త సినిమా చేస్తున్న నాని.. ఈ సినిమా చిత్రీకరణ సమయలో గాయపడ్డారని తెలిసింది. ఈ మ‌ధ్యే షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో నానికి చిన్న యాక్సిడెంట్ జరిగిందని సమాచారం. వివరాల్లోకి వెళితే..

    జెర్సీ స‌క్సెస్ తర్వాత

    జెర్సీ స‌క్సెస్ తర్వాత

    కెరీర్ లో కాస్త డీలా పడ్డ నానికి జెర్సీ స‌క్సెస్ మంచి జోష్ ఇచ్చింది. ఈ జోష్ లోనే డైరెక్టర్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకే చెప్పారు నాని. ఈ చిత్ర షూటింగ్ ఇప్ప‌టికే స‌గానికి పైగా పూర్తైపోయింది కూడా. అయితే ఈ మధ్యే షూటింగ్ జ‌రుగుతున్న స‌మ‌యంలో నానికి చిన్న యాక్సిడెంట్ కావడంతో ఆయన కాలికి గాయమైనట్లు తెలుస్తోంది.

    ఆసుపత్రిలో నాని.. డాక్టర్లు ఏమన్నారంటే..

    ఆసుపత్రిలో నాని.. డాక్టర్లు ఏమన్నారంటే..

    సెట్స్ పై నానికి యాక్సిడెంట్ కావడంతో వెంటనే అప్రమత్తమైన యూనిట్ సభ్యులు ఆయనను దగ్గరలోని ఆసుపత్రిలో జాయిన్ చేశారట. నాని గాయాన్ని పరిశీలించిన డాక్ట‌ర్లు ప్ర‌మాదం ఏం లేద‌ని చెప్ప‌డంతో ఊపిరి పీల్చుకున్నారట ద‌ర్శ‌క నిర్మాత‌లు. అయితే ప్రమాదం చిన్నది కావడంతో ఈ విషయాన్ని బయటకు తెలియకుండా జాగ్రత్త పడ్డారని సమాచారం.

    షూటింగ్ క్యాన్సిల్

    షూటింగ్ క్యాన్సిల్

    ప్రమాదం కారణంగా నాని కాలికి గాయం కావడంతో కొన్ని రోజుల పాటు షూటింగ్ క్యాన్సిల్ చేశారు. 10 రోజులు విశ్రాంతి అనంతరం మళ్లీ సెట్స్ పైకి రానుంది గ్యాంగ్ లీడర్ టీమ్. అనుకోని సెలవులు దొర‌క‌డంతో నాని ప్రస్తుతం కొడుకుతో సరదాగా గడుపుతున్నారట. మరో వారం పాటు నాని ఇంటికే పరిమితం అవుతాడని తెలిసింది.

    ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథ

    ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథ

    గ్యాంగ్ లీడర్ సినిమాలో నాని పోషిస్తున్న పాత్ర చాలా విలక్షణమైంది. ఐదుగురు ఆడ‌వాళ్ల చుట్టూ తిరిగే కథతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని.. ఆడవాళ్ళ గ్యాంగ్‌కి బాస్‌గా నటిస్తున్నాడు. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే షూటింగ్ ఫినిష్ చేసుకోనుంది.

    గ్యాంగ్ లీడర్ మూవీ

    గ్యాంగ్ లీడర్ మూవీ

    పలు సూపర్ హిట్ సినిమాలు అందిస్తున్న మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్యాంగ్ లీడర్ మూవీ తెరకెక్కుతోంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్ఎక్స్ 100 ఫేం కార్తికేయ నెగెటివ్ రోల్ లో కనిపించనున్నారు. ఈ చిత్రంలో మేఘా ఆకాష్, ప్రియాంక అరుళ్ అనే ఇద్దరు భామలు నాని సరసన ఆడిపాడుతున్నారు. అనిరుద్ రవిచంద్రన్ బాణీలు కడుతున్నారు.

    English summary
    After Jersey hero Nani's next movie is Gang Leader. The movie has fixed Release Date. In cnema shooting nani injured with a Accident
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X