ఆ సినిమా చూసి థియేటర్ లోనే ప్యాంట్ తడిపేసుకున్న హీరో నాని.. అతని ముందు నవ్వులపాలు
నేచురల్ స్టార్ నాని శ్యామ్ సింగరాయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ చూసిన అనంతరం ఇప్పుడు ఫుల్ కామెడీ ఎంటర్ టైనర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కిన 'అంటే సుందరానికి' సినిమా ఈ నెల 10వ తేదీన విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో చాలా బిజీగా ఉన్న నాని అనేక రకాల విషయాలపై స్పందిస్తూ ఒకసారి సినిమా థియేటర్లో సినిమా చూస్తూనే ప్యాంట్ తడిపేసుకున్న విషయాన్ని కూడా తెలియజేశాడు. పూర్తి వివరాల్లోకి వెళితే..

కడుపుబ్బా నవ్వించడానికి..
నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో ఏదో కొత్తగా విభిన్నమైన అంశాన్ని హైలెట్ చేస్తూ ఉంటాడు. ముఖ్యంగా కామెడీ టైమింగ్ తో ఆడియన్స్ ను చాలా బాగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు. అయితే చాలా రోజులుగా ఈ హీరో నుంచి కామెడీ సినిమా రావడం లేదు అని ఒక నెగిటివ్ కామెంట్ అయితే ఉంది. ఇక ఈ సారి అంటే సుందరానికి సినిమాతో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి సిద్ధమవుతున్నాడు.

గ్రాండ్ రిలీజ్
బ్రోచేవారెవరురా సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకున్న యువ దర్శకుడు వివేక్ ఆత్రేయ తెరకెక్కించిన అంటే సుందరనికి సినిమాను ఏప్రిల్ లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇతర సినిమాల విడుదల తేదీలు క్లాష్ అవ్వడంతో జూన్ 10వ తేదీన విడుదల చేయబోతున్నారు ఇక ఈ సినిమాలో మలయాళం బ్యూటిఫుల్ హీరోయిన్ నజీరియా నటించిన విషయం తెలిసిందే. ఇప్పటికే సినిమాకు అన్ని రకాలుగా మంచి హైప్ ఐతే క్రియేట్ అయింది.

ప్యాంట్ తడిసిపోయింది
ఇక రెగ్యులర్ ప్రమోషన్స్ లో చిత్ర యూనిట్ సభ్యులు కూడా సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇక రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఒక పాత జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్నాడు. ఒక సినిమాకు వెళ్ళవద్దని ఇంట్లో వాళ్ళు చెప్పినా కూడా తన స్నేహితులతో కలిసి వెళ్ళాడట. ఇక ఆ సినిమాలు చూసి భయంతో ప్యాంట్ కూడా తడిసిపోయింది అని చాలా సరదాగా వివరణ ఇచ్చాడు.

అలా పడిపోవడంతో..
ఆ సినిమా మరేదో కాదు రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన హారర్ మూవీ దెయ్యం సినిమా అని నాని వివరణ ఇచ్చాడు. అప్పట్లో ఆ సినిమాకు వచ్చిన క్రేజ్ భయంకరమైన సినిమా అని.. అయితే అలాంటి సినిమాకు నేను నా స్నేహితుడు కలిసి వెళ్ళినప్పుడు సన్నివేశాలతోనే ఒక్కసారిగా భయంతో ఒళ్ళంతా చెమటలు పట్టయని అన్నాడు. ఇక సడన్ గా చేతి లో ఉన్న కూల్ డ్రింక్ కూడా ప్యాంటు మీద పడిపోవడంతో మొత్తం తడిచిపోయింది అని అది చూసి తన స్నేహితుడు నవ్వుకున్నట్లుగా నాని వివరణ ఇచ్చాడు.

లైనప్ లో మరో రెండు
ఇక నాని తదుపరి సినిమాల విషయానికి వస్తే దసర సినిమాతో విభిన్నంగా సిద్దమవుతున్న విషయం తెలిసిందే. ఆ సినిమాను త్వరలో విడుదల చేయాలని నాని ప్రయత్నాలు అయితే గట్టిగానే చేస్తున్నాడు. ఇప్పటికే సినిమాకు సంబంధించి షూటింగ్ కూడా పూర్తయింది. వీలైనంత త్వరగా ఆ సినిమాను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకుంటున్నారు. అలాగే నాని లైనప్ లో మరో రెండు చిత్రాలపై త్వరలోనే క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











