పవన్ కల్యాణ్‌పై హీరో నాని ఊహించని ట్వీట్.. టాలీవుడ్ నుంచి ఇలా చేసిన తొలి స్టార్ ఇతడే!
ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఒకవైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. మరోవైపు తెలుగుదేశం - జనసేన పార్టీ - భారతీయ జనతా పార్టీ కూటమి ఈ ఎన్నికల కోసం సన్నద్ధం అవుతున్నాయి. ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కల్యాణ్ హాట్ టాపిక్ అవుతున్నాడు. అతడి విజయం కోసం ఎంతో మంది సినీ ప్రముఖులు ప్రచారం కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కల్యాణ్‌పై నేచురల్ స్టార్ నాని ఊహించని ట్వీట్ చేశాడు. అందులో ఏముందో మీరే చూసేయండి!
మరో వారంలోనే ఎన్నికలు:ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు మే 13వ తేదీన జరగబోతున్నాయి. దీనికి సమయం ఎంతో లేకపోవడంతో ప్రధాన రాజకీయ పక్షాలు అన్నీ ప్రచారాన్ని ముమ్మరం చేసేశాయి. ఈ ఎన్నికల్లో తమ పార్టీకే ఓటేయాలని జనాలను ఆకర్షించే పని చేస్తున్నాయి. పెద్ద పెద్ద నాయకులు సైతం ఏపీలో సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అక్కడ రాజకీయ వేడి కనిపిస్తోంది.

పవన్ కల్యాణ్ ఫుల్ బిజీగా:ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఎలాగైనా ఓడించాలన్న లక్ష్యంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పావులు కదుపుతున్నాడు. ఇప్పటికే టీడీపీ, బీజేపీతో కలిసి కూటమి ఏర్పాటు చేసిన అతడు.. గెలుపు గుర్రాల కోసం ప్రచారం వేగం పెంచాడు. ఎండను కూడా లెక్క చేయకుండా రోజుకు రెండు మూడు మీటింగ్‌లకు హాజరవుతూ బిజీగా ఉంటున్నాడు.
పిఠాపురంలో వాళ్లందరూ:2024 అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కల్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానానికి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. అక్కడ ఇప్పటికే పలుమార్లు ప్రచారం నిర్వహించిన ఆయన.. ఇప్పుడు వేరే ప్రాంతాల్లో మీటింగ్‌లకు వెళ్తున్నాడు. అందుకే సినీ, టీవీ పరిశ్రమలకు చెందిన నటీనటులు పిఠాపురంలో పవన్ తరపున ప్రచారం చేస్తున్నారు. దీంతో ఈ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది.

పవన్‌కు హీరో నాని సపోర్ట్:ఆంధ్రప్రదేశ్‌లో జరగబోయే ఎన్నికల కోసం సన్నద్దం అవుతోన్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌కు తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన ఎంతో మంది ప్రముఖులు మద్దతు ప్రకటించారు. ఈ క్రమంలోనే ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా జనసేనాని విజయాన్ని కాంక్షిస్తూ X (ట్విట్టర్) ఖాతాలో ఓ ట్వీట్ పెట్టాడు. తద్వారా పవన్‌కు సపోర్ట్ చేసిన తొలి టాలీవుడ్ స్టార్‌గా నిలిచాడు.
అన్నీ సాధించాలి అంటూ:తాజాగా నాని తన ట్విట్టర్‌లో 'డియర్ పవన్ కల్యాణ్ గారు.. మీరు పెద్ద రాజకీయ యుద్దాన్ని ఎదుర్కొనబోతున్నారు. మీ సినీ కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్నది సాధించాలని నేను కూడా కోరుతున్నా. మీరు మీ ప్రామిస్‌లను నెరవేర్చుతారని ఆశిస్తున్నా. నేను మీ విజయం కోసం చూస్తున్నా. అందరూ మీకు మద్దతు నిలుస్తారని అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్' అని రాసుకొచ్చాడు.

నానికి పవన్ ఫ్యాన్స్ ఫిదా:పవన్ కల్యాణ్‌ను సపోర్ట్ చేస్తూ నేచురల్ స్టార్ నాని చేసిన ట్వీట్‌కు చాలా మంది జనసేన కార్యకర్తలు ఫిదా అయిపోతున్నారు. అతడికి థ్యాంక్స్ అంటూ రిప్లైలు ఇస్తున్నారు. దీంతో ఇప్పుడీ ట్వీట్ రాజకీయాల్లోనూ, సినీ రంగంలోనూ హాట్ టాపిక్ అవుతోంది. ఇదిలా ఉండగా.. గతంలోనూ టికెట్ రేట్ల వివాదం సమయంలోనూ పవన్‌కు నాని సపోర్ట్ చేసిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











