TRENDING ON ONEINDIA
-
మంత్రి ఆదికి షాక్: జమ్మలమడుగు అభ్యర్ధిని తేల్చేసారు
-
మీ పాత కారుని కొత్తగా మార్చటం ఎలా.?
-
రూ.4999కే led hd smart tv, ఎలా సొంతం చేసుకోవాలో తెలుసుకోండి
-
వాళ్లంతా మహానుభావులు.. అమ్మాయిల క్లీవేజ్, తొడలు చూసేస్తారు.. నాగబాబు ఘాటు వ్యాఖ్యలు!
-
కోబ్రా దెబ్బకు షారుఖ్ కంపెనీ గింగిరాలు?
-
చీర కట్టుకోవడాన్ని అమితంగా ఇష్టపడుతారా ? ప్రయాణాలకు ఈ చీరలు
వాళ్లను ఎదురు చూసేలా చేయడం ఇష్టం లేక: నాని సర్‌ప్రైజ్
హైదరాబాద్: ప్రేక్షకుల కోసం ఓ చిన్న సర్ ప్రైజ్ ప్లాన్ చేశానని నటుడు నాని చెప్పారు. ఆ సర్ ప్రైజ్ ఏమిటో వచ్చేసింది. సంక్రాంతి సందర్భంగా ఈ సర్ ప్రైజ్ ఇచ్చాడు. నాని హీరోగా కృష్ణార్జున యుద్ధం వస్తోంది.
బోగి రోజు సినిమా ఫస్ట్ లుక్
భోగి రోజు ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను నాని ట్విటర్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఫస్ట్‌లుక్‌లో నాని కోపంగా చూస్తూ కన్పించారు. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అనుపమ పరమేశ్వరన్, రుక్సర్ హీరోయిన్లు.
ట్విట్టర్ వేదికగా
వేసవిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. శనివారం ట్విటర్ వేదికగా ఈ సినిమాకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అని, ఎంసీఏను పెద్ద సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు అని పేర్కొన్నారు.
ఫస్ట్ లుక్, అలా అనిపించింది
మామూలుగా ఓ సినిమా విడుదలకు దాదాపు నెల రోజులు ముందుగా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సాంగ్ విడుదల చేస్తుంటామని, తాము ముందే ఆ పాటను చూస్తుంటామని, ఫస్ట్‌లుక్ కూడా సిద్ధమైపోయి ఉంటుందని, ఇదంతా ఎవరి కోసం చేస్తున్నామో.. వాళ్లని చివరి వరకు ఎందుకు ఎదురుచూసేలా చేయడమని తనకు మొన్న అనిపించిందని పేర్కొన్నాడు.
పెద్ద పండుగ సంక్రాంతి
మనకు అన్నింటి కన్నా పెద్ద పండుగ సంక్రాంతి అని, భోగి రోజున కృష్ణ, సంక్రాంతి రోజున అర్జున్ ఫస్ట్‌లుక్‌లను, కనుమ రోజు సినిమాలోని ఫస్ట్‌సాంగ్‌ను మీరు చూడబోతున్నారని, మీ అందరికీ నచ్చుతాయని ఆశిస్తున్నానని, అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలని పేర్కొన్నారు.